పులివెందుల
పులివెందుల అర్బన్ సీఐగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శంకర్ రెడ్డిని రెడ్డి కమ్యూ నిటీ డెవలప్మెంట్ సొసైటీ పులివెందుల నియోజక వర్గ నాయకులు పులివెందుల పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రెడ్డి కమ్యూనిటీ సొసైటీ నాయకులు సిఐ ని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంగా మారి, అసాంఘికశక్తుల భరతంపట్టి, పులివెందుల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకై కృషిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భం గా వారు ఆకాంక్షించారు. అర్బన్ సీఐ శంకర్ రెడ్డి మాట్లాడుతూ, అన్నివర్గాలను కలుపుకుని ప్రజల అండదండలతో పట్టణంలో అసాంఘిక కార్యక్ర మాలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామ ని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని, సామాన్య ప్రజ లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామ ని తెలియజేస్తూ, తనకు శుభాకాంక్షలు తెలియజే సిన రెడ్డికమ్యూనిటీ సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి , ముతుకూరు ప్రదీప్ కుమార్ రెడ్డి, రామాపురం శ్రీనివాసరెడ్డి, చంద్రఓబు లరెడ్డి, సిద్దారెడ్డి, గోపాల్ రెడ్డి, ఆర్టీసీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.