డా. పాండురంగారావు విస్తృత ఏర్పాట్లు
తుని
చీఫ్ వైయస్ షర్మిల సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. పిసిసి పగ్గాలు అందిపుచ్చుకున్న వైయస్ షర్మిల రాష్ట్రంలో అధికార వైసిపి ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలకు దీటుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవిరళ కృషి చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఆమె బలమైన క్యాడర్ ను ఏర్పరుస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా వైయస్ షర్మిల తుని పట్నంలో పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు నేతృత్వంలో షర్మిల పర్యటనా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంకర పద్మజ, జనరల్ సెక్రెటరీ జగత శ్రీనివాస్ డాక్టర్ పాండురంగరావు తో కలిసి ఏర్పాట్లు ను సమీక్షించారు.గురువారం కొవ్వూరు నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం నాలుగు గంటలకు షర్మిల తుని పట్టణానికి చేరుకుంటారు. ఇక్కడ డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రోడ్ షోలో షర్మిల పాల్గొంటారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పర్యటనా ఏర్పాట్లు సమీక్షించిన అనంతరం సుంకర పద్మజ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తూర్పార్బట్టారు. ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించలేకపోయినా వైకాపా తన అసమర్ధతను కప్పిపుచ్చుకున్నందుకే కాంగ్రెస్ పై విమర్శలకు దిగుతుందని ఆరోపించారు