శ్రీరామ్ ను కలిసిన పట్ర సామాజికవర్గం
ముదిగుబ్బ
ముదిగుబ్బ మండలంలో మారుమూల ప్రాంతాలలో నివసిస్తూ ఫ్యాక్షన్ కోరల్లోచిక్కి బతుకునీడుస్తున్న పట్ర కులస్తులకు గతంలో పరిటాల రవీంద్ర ఎంతగానో సహాయ సహకారాలు అందించారని ఆయనకు మాసామాజిక వర్గం ఋణపడి ఉందని ఆయన వారసుడిని గెలిపించి ఆరుణాన్ని తీర్చుకుంటామని పట్రవర్గం నాయకులు అన్నారు. బుధవారం ముదిగుబ్బ మండల వ్యాప్తంగాఉన్న పట్రకులస్తులు ఆకులసంఘం నాయకుల ఆధ్వర్యంలో అనంతపురంలోని శ్రీరామ్ నివాసంలో కలిశారు. ఈసందర్భంగా వారి సాధకబాధలు శ్రీరామ్ కు తెలుపుకుంటూ నేటికీ ఆప్రాంతంలో పట్రవారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికితెస్తూ పరిటాల రవీంద్రతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. రవీంద్ర మరణానంతరం ఆప్రాంత ఫ్యాక్షన్ నాయకుల అరాచకాలతో ఆర్థికంగా చితికిపోయి చాలామంది చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు గ్రామాలు వదిలి వలసలువెళ్లి కాలం వెళ్లదీశామన్నారు. ఇంతకాలం తర్వాత పరిటాల ప్రతిరూపం మానియోజకవర్గానికి రావడంతో ఎంతో నమ్మకంతో తిరిగి మాగ్రామాలకు చేరుకున్నామన్నారు. నేటికీ తమగ్రామాలు, కాలనీలలో ఎలాంటి మౌలికవసతులు లేక వెల్లదీస్తున్నామన్నారు. ఎప్పుడైనా పత్రికలు, టీవీ మాధ్యమాలలో మాతిప్పల గూర్చి వచ్చినప్పుడు మంచిఅధికారుల ఉంటే సమస్యలు నెరవేరాయే తప్ప మాకంటూ కాంగ్రెస్, వైయస్సార్సీపి ప్రభుత్వాలలో ఎలాంటి ప్రయోజనాలు నెలకొనలేదన్నారు. చివరకు మాపిల్లలు అప్పట్లో బసిరెడ్డిపల్లి నుండి ఈప్రాంత పెత్తందారుల భూముల గుండా నడిచి మల్లేపల్లి ఉన్నత పాఠశాలకు వెళుతుండగా చదువుకోకూడదని అడ్డుకున్న సంఘటనలు అప్పట్లో పత్రికల్లో రావడంవల్లే నాడు ఎస్పీ మాప్రాంతానికి వచ్చి ఆకుతోటపల్లెలో నిద్రచేసి ఆఅధికారి మాసమస్యలు కొన్నిటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ఇలా వారిబాధలు చెప్పుకొని ఇకనుండి పార్టీకి పూర్తిస్థాయిలో పనిచేస్తామని తమ మండలంలో అత్యధిక మెజారిటీ తెస్తామని శ్రీరామ్ కు ఆసంఘం నాయకులు తెలిపారు. వారితో శ్రీరామ్ మాట్లాడుతూ పరిటాల కుటుంబం, తెలుగుదేశంపార్టీ పట్ర కులస్తులకు అండగా ఉంటుందన్నారు. టిడిపి అంటేనే బీసీలపార్టీ అనికూడా గుర్తుచేస్తూ ఇప్పటినుండి ముదిగుబ్బ మండల తెలుగుదేశం నాయకులతో కలిసి చురుకుగా పని చేయమని సూచిస్తూ మీరు మాకుటుంబం పై చూపిస్తున్న ప్రేమను గుర్తుపెట్టుకుని మీఅభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఈకార్యక్రమంలో ముదిగుబ్బ మండలంలోని బసిరెడ్డిపల్లి, పైపేడు, మద్దన్నగారిపల్లి, పెద్దన్నగారిపల్లి, కొండగట్టుపల్లి, గుట్టకిందపల్లి, సిరగారిపల్లి, ఇరికిరెడ్డిపల్లి, తప్పిటవారిపల్లి, చిత్రవాండ్లపల్లి, చెంచుగారిపల్లి తదితర గ్రామాలకు చెందిన పట్ర వర్గానికి చెందిన గంగినేని పెద్దవెంకటరమణ, కేతినేని వెంగముని, లోకేష్, కేరమణయ్య, రవీంద్రనాయుడు, పెద్దన్నగారిపల్లి, రమణయ్య, పైపేడు వెంకటకృష్ణ, నాగముని, పూలకట్లు రాజా తదితరులు పాల్గొన్నారు.