పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని,పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి).సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.)సమీక్షిస్తూ పెండింగ్ దరఖాస్తుల గ్రౌన్డింగ్,ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని మరియు ఎల్.డి.ఎం.వాటికి అనుబంధ బ్యాంకులు లోన్లు ఇచ్చేలా సత్వరమే గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2023 నుండి 80 పరిశ్రమలకు గాను 57 అనుమతులు సకాలంలో ఇచ్చామని మరో 23 పరిశీలనలో ఉన్నాయని అన్నారు.పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 55 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ.2.48 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 44,విద్యుత్ సబ్సిడీ 4,వడ్డీ రాయితీ 6, స్టాంప్ డ్యూటీ 1 యూనిట్లకు ఆమోదించారు.క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ఏర్పేడు మండలం మాధవమాల కింద వుడ్ కార్వింగ్ క్లస్టర్, కాపర్ వేజెల్స్ క్లస్టర్ ఎర్రమరెడ్డి పాలెం,రేణిగుంట మండలం,వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డైయింగ్ క్లస్టర్,నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించారు.జిల్లాలో పరిశ్రమలు భద్రత ప్రమాణాలు అమలు చేయాలని,ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించి తప్పని సరిగా అమలు చేసేలా చూడాలని ఆదేశించారు.పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.తిరుపతి ఏపిఐఐసి కి సంబంధించి 1 పరిశ్రమ స్థాపనకు గల కాలపరిమితిని పొడిగించడం జరిగింది.సులభతర వాణిజ్య విధానం కింద సింగల్ డెస్క్ పోర్టల్ నందు జనవరి 1,2022 నుండి అక్టోబర్31,2022 వరకు వివిధ శాఖల నుండి పొందిన సేవల మీద దరఖాస్తు దారులను సర్వే చేయడం జరుగుచున్నందున వివిధ శాఖల అధికారులను ఫీడ్బ్యాక్ సర్వే చేయవలసిందిగా ఆదేశించారు.ఈ ఏడాది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నందు మన రాష్ట్రము మొదటి ర్యాంకును పొందేందుకు తిరుపతి జిల్లాలోని అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వివిధ శాఖల నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి,జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి చంద్రశేఖర్,లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్,డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి,పీడీ డిఆర్డిఎ జ్యోతి,వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు