- ప్రజల సహకారం తోడైతే చంద్రబాబు మరిన్ని పనులు చేయగలరు
- దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ఓటే మన ఆయుధం
- సైకిల్ కి అడ్డొస్తే ఎవరినైనా తొక్కుకుంటూ ముందుకెళ్లండి
- సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి సూచన
తెలుగుదేశంపార్టీని ముందుకు నడిపించేది పసుపుసైనికులేనని, కార్యకర్తల త్యాగాలే పార్టీని మరింత ముందుకు నడిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కురిచెర్లపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త బొల్లా సుబ్బారాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించిన అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ..గత ఐదేళ్లుగా తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులను వైసీపీ నాయకులు పెట్టిన ఇబ్బందులు వర్ణనాతీతం. వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతున్నారనే కక్షతో చంద్రబాబును అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఏపీని చంద్రబాబు ఇతర రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధిలో నిలిపారు. మరో ఐదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఏపీ తెలంగాణకు ధీటుగా నిలబడేది. దురదృష్టవశాత్తు వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఐదేళ్లలో రాష్ట్రం మరో 30ఏళ్లు వెనక్కి పోయింది. అప్పులు చేయడం తప్ప వైసీపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదు. అమరావతి రైతులు చంద్రబాబుపై నమ్మకంతో 33వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. అలాంటి రైతుల త్యాగాలను వైసీపీ నాయకులు అవమానపరిచారు. రాజధానిని నాశనం చేసి, రాష్ట్రానికి రాజధానిలేకుండా చేశారు. ఏపీని గంజాయికి అడ్డాగా మార్చారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పి, డ్రగ్స్ రాజధానిగా చేశారు. తాజాగా విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. అవన్నీ వైసీపీ నాయకులకు సంబంధించినవేనని సీబీఐ తేల్చింది. వైసీపీ పాలనలో రాష్ట్ర యువత భవిష్యత్తును గంజాయికి బానిసలుగా మార్చారు. మహిళలకు కూడా గంజాయి అలవాటు చేసి, ఆ మత్తులో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రానున్న ఎన్నికల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలంతా చేయి చేయి కలిపి ముందుకు కదలాలి. పసుపు సైనికులు మరింత రెట్టింపు ఉత్సాహంతో రానున్న నెలరోజులు పార్టీ గెలుపుకోసం కష్టపడాలి. తోట చంద్రయ్య అనే కార్యకర్తను వైసీపీ రాక్షసులు జై జగన్…జై వైసీపీ అని చెప్పాలని మెడపై కత్తిపెట్టి బెదిరించారు. కానీ తోట చంద్రయ్య జై తెలుగుదేశం…జై చంద్రబాబు అని చెప్పి పార్టీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన పసుపు సైనికుల త్యాగాలను వ్యర్థం కానివ్వకూడదు. వైసీపీని గద్దె దించేందుకు సైకిల్ కి ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ ముందుకెళ్లిపోవాలి. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలి…ప్రతి కార్యకర్త బాధ్యతగా ప్రజలతో ఓట్లు వేయించేలా చూడాలి అని భువనేశ్వరి అన్నారు.