రిశుద్ధ్యం మెరుగులో కార్యదర్శులే కీలకం
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
- మస్టర్ తనిఖీలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి
హిందూపురం టౌన్
పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో సురక్షిత ప్రమాణాలు పాటిస్తూ బాధ్యత గా విధులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం వివిధ డివిజన్ లలో కార్మికుల మస్టర్ ను ఆకస్మికంగా కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ వారీగా ఎంతమంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు, ఇందులో పర్మనెంట్ కార్మికులు ఎంతమంది, కాంట్రాక్ట్ పద్ధతిని ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది మేస్త్రీలు ఉన్నారు తదితర విషయాలను శానిటరీ ఇన్స్ పెక్టర్ శంకర్ తో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్మికులతో మాట్లాడుతూ కార్మికులు
విధుల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. బూట్లు, గ్లౌజ్ లు తదితర రక్షణ వస్తువులను వాడాలన్నారు వాడాలన్నారు. ప్రధానంగా పురపాలక పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వేకువ జామునే విధులకు హాజరు కావాలన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో విధులు ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. పట్టణ సుందరీకరణ, పారిశుద్ద్యం మెరుగులో శానిటేషన్ కార్యదర్శులు కార్మికులను సమన్వయం చేసుకొని పనులు చేయించాలన్నారు. విధులకు ఆలస్యoగా వచ్చిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శానిటేషన్ కార్యదర్శులు పారిశుధ్య పర్యవేక్షణ విధులకు గైర్హాజరైతే నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత శానిటరీ ఇన్స్ పెక్టర్ శంకర్ ను ఆదేశించారు. పట్టణ సుందరీకరణ, పారిశుద్ద్యం మెరుగు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
అనంతరం పారిశుధ్య పర్యవేక్షణ లో బాగంగా పట్టణంలో వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్ పెక్టర్ శంకర్, సచివాలయం పారిశుద్ధ్యం కార్యదర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.