పనితీరు నచ్చకా -పార్టీ బలోపేతనికా?
రామచంద్రపురం టీడీపీలో అంతర్గత వర్గ పోరు.
నేడో రేపో భయటపడనున్న వర్గవిబేధాలు.
ప్రజాభూమి, రామచంద్రపురం
రామచంద్రపురం టీడీపీలో వర్గ విబేధాలతో ఆపార్టీ శ్రేణులు కార్యక్రమలకు సైతం డుమ్మా కోడుతున్నా ఆపార్టీ ఇంచార్జి పట్టించుకోకపోవడంపై పార్టీ శ్రేణులుల్లో అసహనం వ్యక్తం మౌతోంది.దీంతోతెలుగు దేశం పార్టిలో ఐకమత్యం లోపించి వర్గ విబేధాలుకు దారితీయడంలతో పార్టీకేడర్ అయోమయంలో పడింది .ఇందుకు నిదర్శనం ఇటువల రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఇంచార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సాక్షిగా పార్టీ సీనియర్ కార్యకర్తపై జరిగిన బౌతిక దాడే నిదర్శనం.దీంతో పార్టీని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఇక్కడ ఇంచార్జి రెడ్డి సుబ్రహ్మణ్యంపార్టీ సీనియర్ కార్యకర్తలపై భౌతిక దాడులపురి గొల్పడం వంటి పరిణామాలుతో పార్టీ లో వర్గవిబేదాలకు దారి తీసింది. దీంతోతెలుగుదేశం పార్టీ కంచుకోటైన రామచంద్రపురం తెలుగుదేశంలో పార్టీ శ్రేణుల్లోనే ముసలం ఎర్పడింది. గతరెండు సంవత్సరాల క్రితం కొత్తపేట నుండి పార్టీ ఆది నాయకత్వం ఆదేశాలు మేరకు ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన రెడ్డి సుబ్రహ్మణ్యం పార్టీ కేడర్ని ఒకతాటిపైకి తేలేక పోరయారన్న ఆరోపణలు ఆపార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.ముఖ్యంగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఒక వర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ మిగతా వర్గాల కేడర్ని పట్టించుకోకపోవడం పార్టీలో వర్గవిబేధాలులతో ఎకమయ్యే పరిస్థితి కానరావడం లేదు. అలాగే పార్టీలో బాధ్యతలు చేప్పట్టిన నాటినుండి పార్టీ సీనియర్ల ప్రమేయంకాని ,సలహాలుకాని తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో పార్టీలో పలువురు పదవులు సైతం తొలగించి తన అనుకూల వ్యక్తులకు కట్టబెట్టడంవంటి పరిణామాలు తో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నేతలు సైతం జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. పైగా తమ వయసుకు సైతం గౌరవం దక్కని పరిస్థితి రావడంతో కక్కలేక మింగలేక పార్టీ పరువు బజారున పడేయడం ఇష్టం లేక పార్టీలో క్లశిక్షణలో పించినా ఎమీచేయలేని పరిస్థికి పార్టీ సీనియర్ నేతలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈయన ఇంచార్జి గా నియోజవర్గానికి వచ్చినప్పటినుండి పార్టీ కార్యకలాపాలు విధిగా నిర్వర్తించినప్పటికీ అనుకున్నస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చెయ్యకపోగా కార్యకర్తలను రెండు
వర్గాలుగా విభజించారన్న వార్తలు బహాటంగానే వినిపిస్తున్నాయి. పైగా అధికార పార్టీ చేసే అవినీతి
అక్రమాలపై మాట్లాడకపోవడం , అధికార పార్టీ నేతలు తెలుగుదేశంకార్యకర్తలపై పలు సందర్భంలో బనాయిస్తున్న తప్పుడు కేసులపై సైతం స్పందించకపోవడం వంటి పరిస్థితికి నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షాత్తుతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ను స్థానిక మంత్రి వేణువ్యంగ్యాస్త్రాలతో ఎన్ని మార్లు విమర్శించిన ఒక్కసారైనా స్పందించకపోవడం
గమనార్హం. కాగా ఇప్పటికే పొరుగు నియోజకవర్గ నాయకులు ఇక్కడ తమపై రాజ్యమేలుతున్నారనే వాదన పార్టీ శ్రేణులుతో పాటు ఇటీవలనియోజకవర్గ ప్రజల్లో బలంగా గూడుకట్టుకుంది .ఇందుకు కారణం ఇటీవల
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ వీరాభిమాని కె.గంగవరం మండలం పాణింగపల్లి కి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త మురార్జీపై జరిగిన భౌతికదాడి ,దాని తరువాత ఇటీవల ఇద్దరు క్లష్టర్లుతో పాటు కాజులూరు మండల పార్టీ అద్యక్ష పదవిని తోలగించి వేరేవారికి కట్టబెట్టడంవంటి పరిణామాలుతో తెదేపా నాయకత్వ లోపంలోని డొల్లతనం బయటపడింది. ఈవిషయాన్ని సైతం గతకొద్ది రోజులుగా జరుగుతున్న పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలను తప్పించి వైసీపీకి అనుకూలమైనబలహీనమైన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వనించి తెలుగుదేశం పార్టీని మరింత బలహీనపరుస్తూ పార్టీ కేడర్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీలో వర్గవిబేధాలు ఎక్షణాల్లోనైనా బయటపడి బగ్గుమనే పరిస్థితి రామచంద్రపురం టీడీపీ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనరామచంద్రపురంలో సరైన స్థానిక ఇన్చార్జిని ఎంపిక చేసి పార్టీని కాపాడాలని పలువురుపార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఇదే ప్రయత్నంలో పలువురు పార్టీ శ్రేణులు ఉన్నట్టు విశ్వసనీయసమాచారం ఏది ఏమయినా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీలో ఇలాంటి పరిస్థితలు ఏర్పడటం పార్టీకి నష్టం వాటెల్లే చూచనలు మెండుగా ఉన్నాయని పలువురు సీనియర్ నేతలు తమలో తామే మదన పడుతున్నారు.