Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుపార్లమెంట్ అసెంబ్లీలో 60 శాతం బీసీలకు పదవులు

పార్లమెంట్ అసెంబ్లీలో 60 శాతం బీసీలకు పదవులు

సీఎం జగన్ ఆశయ సాధన కోసం ఏలూరు ఎంపీ స్థానం బీసీ లకు కేటాయింపు

నియోజకవర్గంలో ఏం చేశానో చర్చకు సిద్ధ మేనా

చంద్రబాబుపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఫైర్..

కామవరపుకోట
దళిత బీసీలకు రాజ్యాధికారం కల్పన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని ఆయన ఆశయ సాధన కోసం ఏలూరు ఎంపీ స్థానంలో బీసీ అభ్యర్థిని బలపరచడం జరిగిందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఇటీవల చింతలపూడిలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలపై ఎంపీ శ్రీధర్ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏం చేశాను చర్చకు నువ్వు సిద్ధమేనా అని ప్రశ్నించారు . ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో నువ్వు రైతుల కోసం ఏమి చేయకపోతే
వేలాది మంది రైతుల వ్యవసాయ అభివృద్ధి కోసం ధర్మాజీగూడెం పాలవాగు కు 50 లక్షల రూపాయలు వెచ్చించమన్నారు. టిడిపి ప్రభుత్వంలో మీ ఎంపీ ఆయన నిధులను వాడకుండా ఉంటే ఆ నిధులు సైతం ప్రతి పైసలు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఖర్చు చేయడం జరిగిందని రికార్డులు సైతం తీసుకువచ్చి నిరూపిస్తామని సవాల్ విసిరారు .
కరోనా సమయంలో ఎన్నారైలను సమీకరించి ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఎంతోమంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ యూనిట్లు మందులు వైద్య సేవలు వసతి ఎవరు కల్పించారు .మీ టిడిపి నాయకుల్ని అడిగి తెలుసుకోవాలన్నారు. ఎంపీ నిధులను రైతుల అభివృద్ధి రోడ్ల నిర్మాణానికి వెచ్చించానని నియోజకవర్గానికి వచ్చి చూసుకోవాలన్నారు.
తాను భారత రక్షణ శాఖ మంత్రివర్యులు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర ముఖ్య ప్రతినిధులతో మాట్లాడిఏలూరుజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం జీలుగుమిల్లిలో 2000 ఎకరాల్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో నేవీ బేస్ క్యాంపు ఏర్పాటు ప్రక్రియ వేగా వంతం గా జరుగుతుందన్నారు. దీనివల్ల దాదాపు 20వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా స్వయం ఉపాధి కలుగుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భూముల క్రయ,విక్రయాలు రవాణా గుర్తింపు అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందిఅన్నారు. విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధిని సాధిస్తాయ అని అన్నారు. పార్లమెంటులో కొవ్వూరు భద్రాచలం మధ్య రైల్వే లైను
ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నిలుపుదల
తెలంగాణ రాష్ట్ర రైతులతో సమానంగా ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర
కొల్లేరు ప్రజల కోసం రెగ్యులేటర్ మంజూరు, జుట్టు వ్యాపారం విదేశాల్లో కాకుండా ఇండియాలోనే జరిగేలా ప్రత్యేక చట్టం ,విశాఖ రైల్వే జోన్ మంజూరు, సత్తుపల్లి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కి సర్వీస్ రోడ్డు మంజూరు, పలు రకాల క్యాన్సర్ కు కారకమైన పొగాకు నిషేధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు అమలు తో పాటు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యలపై ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం తో వాటి లో కొన్ని పరిష్కారం అయ్యాయన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం లో రాష్ట్రంలో కోటగిరి శ్రీధర్ నీతి నిజాయితీ వ్యక్తిత్వం సేవగునం అందరికీ తెలుసునన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా 1,65,000 మెజార్టీ వచ్చిందని అది నాకు ఏలూరు జిల్లా లో వున్న ప్రజా ఆదరణ మద్దతు
ఆ భిమానం ఈ మెజారిటీ బహుశా ఏ ఎన్నికలలో మీకు రాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓటమిని ముందుగానే ఊహించిన చంద్రబాబు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ ను వెర్రి పప్ప అనటం చంద్రబాబు అహంకారానికి పెత్తందారి మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. వాస్తవాలన్నీ ఎలా ఉంటే ఏం మాట్లాడాలో ఎవరి గురించి మాట్లాడాలో సందిగ్ధంలో ఉన్న చంద్రబాబు ఆయన స్థాయిని దిగజార్చుకుని దురుద్దేశంతో మాట్లాడటం దిగజారుడుతనానికి అడ్డంపెట్టిందన్నారు. చింతలపూడిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని దళితులు,బీసీలు, గిరిజనులు గుర్తుంచుకుంటారన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో మీకు మీ కూ టమికి గుణపాఠం చెప్పడం తద్యమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article