న్యాయం చేయకపోతే…. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం.
రామచంద్రపురం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై మంగళవారం మహిళా యూనివర్సిటీలో జరిగిన హత్యాయత్నం కేసులో రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీ గడ్డ కింద పల్లె గ్రామానికి చెందిన ఎద్దుల భాస్కర్ రెడ్డి, కామసాని సాంబశివారెడ్డి లను రామచంద్రాపురం ఎస్ఐ చిరంజీవి విచారణ పేరుతో పిలిపించి అక్రమ కేసులు బనాయించారని, కూలి పనులు చేసుకొనే తమకు కడుపుకోత మిగిల్చారని సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మా కుమారుడు ఎక్కడున్నారో పోలీసులు తెలపడం లేదని,హత్యాయత్నం కేసులో తమకు సంబంధం లేనప్పటికీ కేవలం రాజకీయ కక్షతో తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని తమ కుమారుని వెంటనే విడిపించకపోతే తాము కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడతామని, దీనికి పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని భాస్కర్ రెడ్డి తల్లిదండ్రులు వాపోయారు , ఘటన జరిగిన సమయంలో మా వారు మహిళా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో లేమని,మా స్వగ్రామంలోని మాకు సంబంధించిన ఫ్యాక్టరీలో కార్యకలాపాలు సాగిస్తున్నామని అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో రికార్డులు పరిశీలించాలని, ఎద్దుల భాస్కర్ రెడ్డి భార్య కోరారు. కేవలం వైసీపీలోని ఒక వర్గం వారిపైనే కేసు నమోదు కావడం పలు అనుమానాలకు దారితీస్తుందని లేదా అనుపల్లి పంచాయతీకి చెందిన టిడిపి నాయకులు తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమకు సంబంధం లేని కేసుల లో ఇరికించారని, దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో తాము
ఈసీకి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామని, సమాజంలో తమ పరువు మర్యాదలకు భంగం కలిగించిన వారిని కోర్టుకు ఈడ్చుతాం అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.