టిడిపి అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పులివెందుల
అటు రాష్ట్రంలోనూ,ఇటు పులివెందుల నియోజక వర్గంలోనూ వైకాపా పార్టీపై ప్రజలకు తీవ్ర వ్యతిరే కత ఉందని, ఈ వ్యతిరేకతతో రాబోయే ఎన్నికల లో పులివెందులలో టిడిపి విజయం తధ్యమని పులివెందుల టిడిపి అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ( బీటెక్ రవి ) అన్నారు శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ పులివెందులలో వైకాపా పార్టీ కి తీవ్ర వ్యతిరేకతను తెలుసుకొని ఓటుకు 2000 రూపాయలు పంచె దీనస్థితికి వైకాపా నాయకులు వచ్చారన్నారు ఓటర్లకు డబ్బులు ఇవ్వలేదని ఎక్క డైనా ప్రమాణం చేసి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్యేలుగా,ముఖ్యమంత్రిగా, ఎంపీ లుగా చేసినవాళ్లు ఓటర్లకు భయపడి ఎక్కడ మాకు వ్యతిరేకత ఉందో ఆని ఓటుకు 2000 పంచుకునే దీనస్థితికి వచ్చారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లేఅని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని జగన్ అంటున్నారని మంచి జరగడమంటే కరెంట్ బిల్లు పెరగడమా, రైతులకు ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాలు పంపిణీ చేయకపోవడం మంచి జరగడం అని ఆయన ఎద్దేవ చేశారు రాష్ట్రంలో మద్యం తాగి దాదాపు 1400 మంది మృతి చెందారని వారి కుటుంబాలకు మంచి జరిగినట్లేనా అని ఆయన ప్రశ్నించారు పరిశ్ర మలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారన్నారు ఎన్నికలలో దొంగ ఓట్లకు పాల్పడితే తాము సహించబోమని తాము కూడా ఫ్యాక్షన్ గ్రామం నుంచి వచ్చామని చంపటానికైనా చావడానికి అయినా సిద్ధమేనన్నారు దొంగ ఓట్లు వేసే వారిని పోలీసులకు పట్టించడం జరుగుతుంద న్నారు ప్రతిసారి జగన్ ఇది పేదవాడికి, పెత్తందారికి పోటీ అంటుంటారని 750కోట్లు చూపించుకున్న వ్యక్తి పెత్తం దారి అవుతాడా? తక్కువ ఆస్తి ఉన్న నేను పేదవాడినన్నారు కాబట్టి పులివెందులనియో జకవర్గం వాళ్ళందరినీ కోరుతున్నా పేదవాడిని అయిన నాకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఇన్నాళ్లు వైఎస్ కుటుంబానికి అవకాశం ఇచ్చారని ఈసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నేను ఏమిటో నేను ఏమి అభివృద్ధి చేస్తానో అవకాశంఇచ్చిచూడా లని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.