Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుపెండింగ్ కేసులు త్వరగా పరిష్కస్తాం

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కస్తాం

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

అనంతపురము
తుది ఓటర్ల జాబితాలో డూప్లికేట్, డెత్ కేసులు, మోర్ దెన్ 10 ఎలక్టర్స్, తదితర వాటికి సంబంధించి కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని
జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం ఎన్నికల సన్నద్ధత, ఎలక్టోరల్ రోల్ సమస్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రీ దేవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులను నిత్యం మానిటర్ చేయడం జరుగుతోందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సెక్టోరియల్ అధికారులకు, ఏఎల్ఎంటిలకు శిక్షణ పూర్తి చేశామని, రెండవ విడత శిక్షణ వచ్చే వారంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశామని, అడిషనల్ పోలింగ్ సిబ్బందిని గుర్తించామని వివారించారు. జిల్లాలో 10 వరకు పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరుగుతోందని, వారం రోజుల్లోపు పనులను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోకి మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్ పోస్ట్ లను బలోపేతం చేశామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులను నిత్యం మానిటర్ చేయాలన్నారు. అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ కు పంపాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచనలు పాటించాలని, ఎన్నికల విధులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నోడల్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఈఆర్ఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్ఓలతో క్షేత్రస్థాయిలో ఇంటరాక్ట్ కావాలని, సంబంధిత ఏఈఆర్ఓలతో ఈఆర్ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. క్లెయిమ్స్ లను ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పోలింగ్ స్టేషన్ వారిగా ఎలక్టోరల్ రోల్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నారు. సాధారణ ఎన్నికల -2024 సన్నద్ధతపై అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా, బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, ఈఆర్ఓలు వారి పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ ను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని, మరమ్మత్తులు కూడా చేయించాలని, మండల స్థాయి టీంలు పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉందో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలన్నారు. ప్రతి చోటా బోర్వెల్, ఫర్నిచర్, గేట్స్, విద్యుత్ సరఫరా, తదితర పనులు జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు గ్రంధి వెంకటేష్, రాణి సుస్మిత, వి.శ్రీనివాసులు రెడ్డి, ఈఆర్ఓలు వెంకటేశ్వర్లు, కరుణకుమారి, వెంకటనారాయణమ్మ, వరప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, డిఐఓ రవిశంకర్, ఎన్నికల సెల్ సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, తహసీల్దార్లు, ఎన్నికల డిటిలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article