అనంతపురము:పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని ఐసీడీఎస్ అనంతపురం రూరల్ సీడీపీఒ ధనలక్ష్మి తెలిపారు. సోమవారం రూరల్ పరిధిలోని ఏ. నారాయణపురం , సోమనాథనగర్ అంగన్ వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీడీపీఓ ధనలక్ష్మి హాజరై పోషణ పక్షోత్సవాల ప్రాధాన్యత, పోషక విలువలు కలిగిన ఆహారం గురించి వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది , పిల్లల తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందిస్తామని, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తామని సీడీపీఓ అన్నారు. మినుములు, రాగి, జొన్న , కొర్రలు, ఊదలు, అండు కొర్రలు తదితర సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని తెలియజేశారు. వైఎస్ఆర్ కిట్ల కింద అందించే పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరంగా జీవించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు . కార్యక్రమంలో సూపర్ వైజర్ జయశ్రీ , అంగన్వాడీ వర్కర్లు కాసుంచాను, సీతమ్మ, మహబూబీబీ, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు .