ఏలేశ్వరం:-ప్రత్తిపాడు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిల్లి బలరాముడు ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన తన
మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటివరకు పేద వర్గాల నుండి ఒక్కరు కూడా రాజ్యాధికార దిశగా అడుగులు వేయలేదని, 80 శాతం ఉన్న ప్రజలలో అత్యధికంగా బీసీలు, ఎస్సీలు ఉండగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నత వర్గాలలో రెండు కుటుంబాలకే అధికారం కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చిన ఆ రెండు కుటుంబాలలో పెద్ద మనుషులు నియోజకవర్గంలోని నిధులు నిక్షేపాలు దోచేయడంతో పాటు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను తమకు ఇష్టం వచ్చినట్లు తమ వర్గాల వారికి దోచిపెట్టడం దారుణం ఎద్దేవా చేశారు. తాను రాజకీయ ప్రక్షాళన కోసం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రానున్న 2024 ఎన్నికలలో దిగనున్నట్లు దీనికి సంబంధించి ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికై ఒక మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుమర్తి సత్యనారాయణ, చెప్పుల రాంబాబు, రాజు, శ్రీను, అప్పన బాబు, యేసు బాబు ,జ్యోతి బాబు ,జయ బాబు తదితరులున్నారు.