న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.స్వల్ప అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. అందువల్ల శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లో అడుగుపెట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చారు.