పరవాడ:- పరవాడ ఫార్మాసిటీ లో భారీ స్థాయిలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ నిర్వహించారు. ఒక పరిశ్రమ లోపల ప్రమాదాలు జరిగినట్టుగా నిర్వహించే మాక్ డ్రిల్ల్ ని ఆన్ సైట్ మాక్ డ్రిల్ల్ అంటారు ఆలా కాకుండా ఒక పరిశ్రమలో పెద్ద ప్రమాదం సంభవించి దాని పరిణామంగా సమీప పరిశ్రమలలో కూడా మంటలు వ్యాపించడం, గ్యాస్ లీక్ అవ్వడం, ప్రేలుళ్ళు జరగడం లేదా ప్రమాదకర రసాయనాలు వెలువడడం లాంటివి జరిగినపుడు వాటిని అదుపు చేయడానికి , ప్రమాద భాదితులను రక్షించి సహాయక కేంద్రాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే చర్యలను ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ అంటారు. 2023 తరువాత ఈ సంవత్సరం జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈ ఆఫ్ సైట్ మెగా మాక్ డ్రిల్ల్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫార్మా సిటీ లోని లారెస్ ల్యాబ్స్ యొక్క సింతసిస్ ప్లాంట్, JPR ల్యాబ్స్ మరియు సింతోకేం పరిశ్రమలలో ప్రమాదకర రసాయనాలు వెలువడి విస్ఫోటనం జరిగినదని ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ నిర్వహించారు ఈ మాల్ డ్రిల్ల్ సందర్బంగా రాంకీ హబ్ నందు, MASRM నందు సహాయక కేంద్రాలుగా పరిగనించి పై పరిశ్రమలలోని ఉద్యోగులను కంపెనీ బస్సుల ద్వారా తరలించారు, రామ్ కీ హాస్పిటల్ పరవాడ ఆరోగ్య కేంద్రం మరియు అగనంపూడి హాస్పిటల్ కి ప్రమాద భాదితులను అంబులెన్సు ల ద్వారా వైద్య సేవల కోసం తరలించారు.
ప్రమాదాలు జరిగిన కంపెనీనీల లోనికి లారెస్ ల్యాబ్స్ అగ్ని మాపక శకటం, రాంకీ అగ్ని మాపక శకటాలు మరియు NTPC అగ్నిమాపక శకటం వచ్చి పేలుళ్లవలన అంటుకున్న మంటలను నియంత్రించాయి. సహాయక కేంద్రాల వద్ద డాక్టర్స్ ను నర్స్ ల ను వాలంటీర్స్ ను నియమించారు హాస్పిటల్స్ వద్ద పర్యవేక్షకులను నియమించారు. ఫార్మాసిటీ లోని వివిధ కూడళ్లలో పర్యవేక్షకులు మాక్ డ్రిల్ల్ జరిగిన తీరును గమనించారు. మాక్ డ్రిల్ పూర్తయిన తరువాత అన్ని విషయాలను పరిశీలించి ఉద్యోగుల హాజరుపట్టీలను చెకింగ్ చేసుకోని అల్ క్లియర్ సైరన్ మ్రోగించారు. హాస్పిటల్స్ నుంచి భాదితులను వెనకకు తీసుకురావడం మరియు సహకాయక కేంద్రాల నుంచి ఉద్యోగాలను వారివారి కంపెనీల కు వాహనాలు ద్వారా తిరిగి పంపించారు. తదుపరి రివ్యూ సమావేశం MASRM నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ADFO ప్రసాద్ రావు , NDRF టీం లీడర్ ఈశ్వర రావు , లారెస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ S . శ్రీనివాస రావు , డిప్యూటీ చీఫ్ V . సురేష్, MASRM ప్రెసిడెంట్ ఎం. శివరాం ప్రసాద్ మరియు మా ఎస్ ఆర్ ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు, లారెస్ ల్యాబ్స్ EHS GM ఎం. శ్రీనివాస్ మైలాన్ EHS జీఎం రామసుబ్బారావు లు ప్రసంగంచారు.ఈ కార్యక్రమానికి ఫార్మా కంపెనీల భద్రతా విభాగాల అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ విజయవంతంగా ప్రణాళిక బద్డంగా తన సూచనలతో తన పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించిన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ V . సురేష్ ని పలువురు ప్రసంసించారు.