Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలు"బాబూ.. నీ ఊసరవెల్లి రాజకీయాలు మానుకో"

“బాబూ.. నీ ఊసరవెల్లి రాజకీయాలు మానుకో”

-వాలంటీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
-చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు
-ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్

కదిరి :టీడీపీ అధినేత చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి రాజకీయాలు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బుల్ విమర్శించారు. శుక్రవారం తలుపుల మండల పరిధిలోని ఓబీఆర్ కొత్తపల్లి, పెన్నబడివాండ్ల పల్లి, ఓబిఆర్ తండా, గుడార్లగొంది, ఓబుల్ రెడ్డి పల్లి, గరికపల్లి, గ్రామాలలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వాలంటీర్లను కించపరచిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి మాయమాటలు చెబుతున్నారని అన్నారు. “ఐదేళ్లుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేం ఎక్కడికి వెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తూ తాము జగన్‌ వెంటే ఉన్నామని అంటున్నారు. ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థను కించపరచిన చంద్రబాబు ఈ రోజు వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చంద్రబాబు తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. 1వ తేదీన ఇంటి వద్దకే అందాల్సిన పింఛన్‌ను అడ్డుకున్న ఘనత చంద్రబాబుదని ప్రజలే అంటున్నారు. గతంలో వాలంటీర్ల అంతు చూస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ఊసరవెల్లి కూడా మార్చలేని రంగులను చంద్రబాబు మారుస్తున్నారు. గతంలో మోదీని విమర్శించిన చంద్రబాబు ఈ రోజు మోడీ కాళ్లు పట్టుకున్నాడు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తాం” అని తెలిపారు.
“2019లో అధికారం కోల్పోయాక చంద్రబాబు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నారు. ఈ రోజు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి తలుపు తడుతున్నారని చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారు. మొన్నటి వరకు వాలంటీర్లను తిట్టి ఈ రోజు ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు వాలంటీర్లకు ముందుగా క్షమాపణ చెప్పాలి. వాలంటీర్లను చూస్తే గుర్తుకు వచ్చేది జగనే. అవ్వాతాలకు పింఛన్లు కూడా ఇవ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు. గతంలో మహిళా సంఘాల రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు వారిని మోసం చేశాడు. ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు. వాలంటీర్లకు రూ.10 వేలు కాదు రూ.50 వేలు ఇస్తామని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు, మిత్రపక్షాలకు ఇవే చివరి ఎన్నికలు. గతంలో టీడీపీకి వచ్చిన సీట్లు కూడా ఈసారి రావు” అని కదిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ భాష, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, సేవాదళ్ జోనల్ ఇంచార్జి డీకే బాబు, ఎంపీపీ రఫీ నాయక్, జడ్పీటీసీ గిరిధర్ రెడ్డి, కన్వీనర్ ఫయాజ్, సీనియర్ నాయకులు కులశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, కుర్లి శివారెడ్డి, మాజీ టెంపుల్ చైర్మన్ గోపాల్ కృష్ణ, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article