Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుబిల్లుల కోసం రైతన్నలు ఎదురుచూపులు! 

బిల్లుల కోసం రైతన్నలు ఎదురుచూపులు! 

ప్రజాభూమి ,వేంపల్లె 
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తాత్కాలికంగా నిల్వ ఉంచుకొని, శుభ్ర పరచుకోవడానికి, గ్రేడింగ్ చేసి విక్రయాలు చేసుకునేందుకు పొలాల్లో రైతులు ప్యాక్ హౌస్ నిర్మించుకున్నారు. నిర్మించుకున్న ప్యాక్ హౌసు బిల్లులు మంజూరు కాలేదు. దీంతో రైతన్నలు బిల్లులు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 14 ప్యాక్ హౌస్ ను మంజూరు చేసింది. ఒక్కో పిహెచ్ఎం ప్యాక్ హౌస్ రూ.4 లక్షలు మంజూరు కాగా రైతు వాటా కింద రూ. 2లక్షలు, ప్రభుత్వ వాటా కింద రూ. 2 లక్షలతో మంజూరైన ప్యాక్ హౌస్ లను రైతులు నిర్మించుకున్నారు. అయితే రైతులు డబ్బులు ఖర్చు చేసుకొని పండ్ల తోటల్లో ప్యాక్ హౌస్ లను నిర్మించుకొని ఏడాది అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు కాలేదు. ప్యాక్ హౌస్ లను రైతులు అప్పు చేసి నిర్మించుకున్నారు. ప్యాక్ హౌస్ పనులు పూర్తయినా అధికారులు వాటికి బిల్లులు మంజూరు చేయలేదని రైతులు వాపోతున్నారు. 
ప్రభుత్వం ఇచ్చే వాటా కంటే అధికంగా ప్యాక్ హౌస్ లకు డబ్బులు ఖర్చు చేసినట్లు రైతులు వాపోతున్నారు. వేంపల్లె క్లస్టర్ లో 12 ప్యాక్ హౌస్ లు పూర్తయ్యాయి. అధికారులు చెప్పినట్లు తూకం వేసే యంత్రం, నీరు పోయే సదుపాయంతో కూడిన గ్రేడింగ్ టేబుల్, ప్లాస్టిక్ టబ్లు, 2,000 లీటర్ల సామర్థ్యం కలిగిన సింథటిక్ వాటర్ ట్యాంక్ పాటు ప్యాక్ హౌస్ లో బ్యాటరీ వంటి పరికరాలు కూడా సిద్ధం చేశామని రైతన్నలు అంటున్నారు. బిల్లులు మంజూరు అవుతాయని ఎదురు చూస్తున్నప్పుటికి ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు. బిల్లుల సమస్యను పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా నిధులు మంజూరులో మాత్రం ఫలితం లేకుండా పోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే నిధులు మంజూరు కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తయినా ప్రభుత్వం వాటా కింద వచ్చే బిల్లులు చెల్లించక పోవడం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు. ఇటివల వీచిన ఈదురు గాలులతో పండ్ల తోటలు దెబ్బ తిని మరింత రైతులు నష్టపోయినట్లు వాపోతున్నారు. ఒక పక్క ప్యాక్ హౌస్ లకు బిల్లులు మంజూరు కాక పోవడంతో పాటు మరో పక్క ఆకాల వర్షాలతో పంటలు, తోటలు దెబ్బ తినడంతో రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్యాక్ హౌస్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

నివేదికలు ప్రభుత్వానికి పంపినాం హర్టీకల్చర్ అధికారి రెడ్డయ్య – వేంపల్లె 

ప్యాక్ హొస్ లకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తే రైతుల ఆకౌంటులోకి బిల్లులు పడతాయాని చెప్పారు. బడ్జెట్ విడుదల కాక పోవడంతో బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article