Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుబైపాస్ రోడ్డుకు కలెక్టరేట్ మార్గ గా నామకరణానికి కృషి చేస్తా

బైపాస్ రోడ్డుకు కలెక్టరేట్ మార్గ గా నామకరణానికి కృషి చేస్తా

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

ప్రజాభూమి భీమవరం

భీమవరం పట్టణంలో బైపాస్ రోడ్డుకు కలెక్టరేట్ మార్గ్ గా నామకరణం చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ బైపాస్ రోడ్డు ప్రజలకు చాలా కీలకంగా మారుతుందని ఆయన తెలిపారు . మంగళవారం3 కోట్ల 65 లక్షల నిధులతో ఏర్పాటుచేసిన బైపాస్ రోడ్డు ను గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ లు ప్రారంభించారు. జడ్డు బ్రహ్మాజీ కళ్యాణ మండపం వద్ద నుండి బి.వి.రాజు బొమ్మ వరకు నిర్మాణం చేసిన సీసీ, బీటీ రోడ్ ను మంగళవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం సిఎస్ ఆర్ ఫండ్స్ నిధులు క్రింద లైన్స్ క్లబ్ తో కలసి 20 లక్షలతో ఏర్పాటు కానున్న బైపాస్ రోడ్ లో క్లాక్ టవర్, పోలీస్ అవుట్ పోస్ట్, కంట్రోల్ ఫ్లడ్ లైటింగ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం జిల్లా కేంద్రం అయిన నేపథ్యంలో పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీకరణను చేస్తున్నామని అన్నారు.
నూతనంగా ఏర్పడిన భీమవరం పట్టణం జిల్లా కేంద్రాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్ సహకారంతో పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారుఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ తాను ఈరోజు నుండి ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతానని, ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే రోజునే జిల్లా కేంద్రమైన భీమవరంలో డైనమిక్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.భీమవరం జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, ఎం ఈ త్రినాధరావు, డి ఇ తోట నారాయణరావు, ఆర్ అండ్ బి డి ఇ రామరాజు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఏ ఎస్ రాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, జాతీయ బిసి సంఘ జిల్లా అధ్యక్షులు కోడె యుగంధర్, వైసిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమబాల, పట్టణ కన్వీనర్ తోట భోగయ్య, మానేపల్లి నాగన్న బాబు,తోట ఫణి, అల్లూరి భాస్కర్ రాజు, పట్టా వెంకట నరసింహారావు, గాదిరాజు సుబ్రమణ్యం రాజు, నల్లం రాంబాబు, కోమటి రాంబాబు, గంటా సుందర్ కుమార్, పాలపర్తి జో నా, షేక్ ఇమామ్, మల్లుల శ్రీనివాసరావు బొక్కా గోపి తదితర నాయకులతో పాటుగా ఏ ఇ లు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article