Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుమత్స్యకారుల పక్షపాతి జగన్

మత్స్యకారుల పక్షపాతి జగన్

ప్రజాభూమి ప్రతినిధి,అనంతపురంః
మత్స్య సహకార సంఘాల లీజు మూడు సంవత్సరములు పొడిగిస్తున్నట్లు జీవో ఎంఎస్ నెంబర్ 99 జారీ చేసి మరొక్కసారి జగన్ ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని రుజువు చేసుకున్నది.
217 జీవో మత్స్య సహకా మత్స్యకారులను నాశనం చేస్తుందని, నానా యాగీ చేసిన వారి నోర్లను ఒక్కసారిగా మూయించడం హర్షించదగ్గ విషయం.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి మత్స్యకారులు తమ సమస్యలను అర్జీ రూపంలో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తోలుతీస్తా, తొక్క తీస్తానన్న మాటలు మత్స్యకారులు మరువలేదు. అలాంటి వారే ఈరోజు మత్స్యకారులపై ఎక్కడలేని ప్రేమను ప్రదర్శిస్తూ 217 జీవోపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. కోర్టులకు వెళ్లారు. అంటే దీని అర్థం మత్స్యకారుల ముసుగులో ఉన్న కొంతమంది పెత్తందారులను కాపాడడం కోసమే.జగన్ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక విప్లవంలో భాగంగా, మత్స్యకారులకు మూడు ఎమ్మెల్సీ, మూడు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఒక మత్స్యకారుని రాజ్యసభకు పంపించడం సరికొత్త చరిత్ర. దీని ఫలితంగానే మన మత్స్యకార ముద్దుబిడ్డ మత్స్య శాఖా మాత్యులు సీదిరి అప్పలరాజు కృషి వల్లనే 99 జీవో వచ్చింది.జగన్ నేనెప్పుడూ మీ వాడినేనని తేట తెల్లం చేస్తూ ఈనెల 1వ తేదీ జీవో నెంబర్ 99ను తీసుకొచ్చి 1432-34 ఫసలికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్యాంకులకు మూడు సంవత్సరముల లీజు పొడిగించడం వల్ల మైదాన ప్రాంత మత్స్యకారులకు ఎంతో లాభం చేకూరుతుంది. ఈ వెసులుబాటు 217 జీవోకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన చెరువులకు వర్తించనందున నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతాలలో మత్స్యకారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. 217 జీవో కేవలం పైలెట్ ప్రాజెక్టు మాత్రమేనని చెప్పినా వినకుండా కోర్టులకు వెళ్లడం వల్ల 99 జీవో వర్తించనందువల్ల, ఆ ప్రాంతం మత్స్య సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి.తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైదాన ప్రాంత మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి సర్వదా ఈ ప్రాంత మత్స్యకారులు రుణపడి ఉంటారు.

  • కె.వి రమణ, డైరెక్టర్, బెస్త కార్పొరేషన్, అనంతపురం జిల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article