జేసిఎస్ మండల కన్వీనర్ ఆర్.శ్రీనివాసులు
- ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రకు సంఘీభావం
ప్రజాభూమి, వేంపల్లె
రాష్ట్రాభివృధ్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సిఎంగా రావాలని వేంపల్లె మండల జగనన్న సచివాలయాల కన్వీనర్ (జేసిఎస్)ఆర్.శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు బసవరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలకు 175 స్థానాలు గెలుపొందాలన్నారు. అలాగే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను సిఎం జగన్ అందిస్తున్నారని, పారదర్శకంగా, వివక్షకు తావిలేకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా సచివాలయ వ్యవస్థతో సిఎం పాలన అందిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోందని..ప్రతి ఇంటికీ మేలు జరిగిందని 175 స్థానాలను వైకాపా కైవసం చేసుకొంటుందనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ సంఘీభావంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ జాకీర్ హుస్సేన్, సచివాలయ కన్వీనర్ నాగేష్, వార్డు సభ్యుడు సునిల్, నాయకులు భూషణం, మహీర్, ముక్తీయార్ తదితరులు పాల్గొన్నారు.