-పాటి చలపతి ఆధ్వర్యంలో మహిళల చే చంద్రన్నకు పాలాభిషేకం
ఎటపాక :ఎటపాక:కూటమి ప్రవేశపెట్టిన మేనిపెస్టోలో మహాశక్తి పధకాలతో మహిళాలకు అధిక ప్రయోజనం చేకూరుతుంది అని టీడీపీ సీనియర్ నాయకులు పాటి చలపతి అన్నారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు మహిళలు ఎంతగానో ఆకర్షితులై అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎటపాక గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు పాటి చలపతి నాయకత్వంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి చిత్రపటానికి మహిళలందరూ శనివారం పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు పాటి చలపతి మాట్లాడుతూ మహిళల కోసం కూటమి ప్రవేశపెట్టిన మహాశక్తి పథకాలతో మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని, ప్రత్యేకించి 18 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఆడబిడ్డా నిది కింద నెలకు 1500,తల్లికి వందనం పేరిట ఎంత మంది పిల్లలు చదువు కున్న వారందరికీ ఒకొక్కరికి 15000రూపాయలు సహాయం,దీపం పధకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం పధకం ద్వారా మహిళలందరికీ 100శాతం రాయితీతో ఆర్టీసీ సేవలను అందించడం జరుగుతుందని,టిడిపి తోనే మహిళా సాధికారత సాధ్యమని ఆయన అన్నారు.టిడిపి ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని అన్నారు.చంద్రబాబు ప్రారంభించిన డ్వాక్రా సంఘం నేడు విస్తరించిందని,మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు అండగా నిలుస్తాయని,ప్రతి ఒక్కరు ఆలోచించి అభివృద్ధి చేసే కూటమికి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మువ్వా ఈశ్వరమ్మ, మాదినేని లక్ష్మి,దుద్దుకూరి వెంకట రావమ్మ, సగుర్తి పుణ్యవతి, దాడి సుజాత, నల్లజాల జయమ్మ, సగుర్తి కరుణ, దుద్దుకూరి పద్మ,దుందుకూరు రవణమ్మ,దాడి రాజమ్మ, దాడి శ్రీదేవి, ధనలక్ష్మి గంప, సావిత్రి గంప, విజయ లంక, లక్ష్మి చెకింగుల, పద్మ కరి,నర్సమ్మ దాడి, రంగమ్మ దాడి మహేశ్వరి, తంగేళ్లపల్లి లలిత కుమారి, చెకింగ్లో పద్మ, అనుగోజు శేషారత్నం, బొల్లా రమాదేవి,ఎల్లంకి పద్మ, దాడి దేవి,దాడి పెద్దదేవి, బోలుసు శ్రీలక్ష్మి,దాడి కమలమ్మ,అరుణ,దాడి వెంకటమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు.