శ్యామలమ్మ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమహిళాఉపాధ్యక్షురాలు.
కడప సిటీ:మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామలమ్మ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని రకాల అంగు ఆర్భాటం చేసేటటువంటి మహిళలను కాకుండా ఆమె పెద్దమనిషి చేసుకొని సామాన్య మైన వికలాంగురాలు అయినటువంటి శ్రీమతి.టి. ప్రేమలతను కడప పట్టణమందు గల కాంగ్రెస్ ఆఫీస్కు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శ్యామలమ్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 128 వ రాజ్యాంగ సవరణ ఆమోదం వలన రాబోవు కొద్ది సంవత్సరాలలో భారతీయ మహిళలకు చట్టసభల్లో గౌరవనీయమైన స్థానంలభించనున్నదన్నారు.తమకంది వచ్చిన మహా అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని మహిళా సాధికారతకు నిజమైన నిర్వచనం చేకూర్చేందుకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం మహిళలు తమ రాజకీయ అధికారాన్ని వినియోగించాలన్నారు. తోటి మహిళలనుప్రోత్సహించాలన్నారు. తమ రాజకీయ ఎదుగుదలను సమాజ హితంతో ముడిపెట్టాలన్నారు. లింగ వివక్షతకు తావులేని సమాజ నిర్మాణానికి దోహదం చేయాలన్నారు.మహిళలు సామాజిక సాధికారతతోపాటు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అందుకోసం మహిళలు తమ గృహాలకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యత, రాజకీయ, వివిధ రంగాల్లో కూడా రాణించాలని కోరారు. అలాగే బాల్య వివాహం అరికట్టేందుకు కృషి చేయాలని, ఇది అందరి బాధ్యతని ఆమె సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నగర అధ్యక్షురాలు వేముల నాగరత్నగౌడ్, వి రమాదేవి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి, పైడికల్వ నాగరాణి, జిల్లా కార్యదర్శి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.