- ఆడపిల్లల్ని చదువులో, అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి
- పాడిపరిశ్రమలను గ్రామాల్లో మహిళలు జీవనోపాధిగా చేసుకోవాలి
- మహిలలను అన్ని విధాలా ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు
- మహిళా పాడిరైతులతో ముఖాముఖిలో భువనమ్మ వ్యాఖ్య
తుళ్లూరు :మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. తుళ్లూరు మండలం, వెంకటపాలెం గ్రామంలో మహిళా పాడిరైతులతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనమ్మ మాట్లాడుతూ…మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన నాయకులు శ్రీ నందమూరి తారకరామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత నారా చంద్రబాబునాయుడు గారు కూడా మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను వ్యాపారాలు, ఆర్థిక రంగంలో ప్రోత్సహించి ముందుకు నడిపారు. 1994లో హెరిటేజ్ సంస్థ బాధ్యతలను చంద్రబాబు నాకు అప్పగించారు. కంపెనీ ఎం.డీ గా నాకు బాధ్యతలు ఇస్తే నా వల్ల ఏం అవుతుంది? అని నేను అన్నప్పుడు…నువ్వు చేయగలవు,…నువ్వు ముందుకు నడిపించగలవు అని ఆనాడు చంద్రబాబు నాతో అన్న మాటలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. కేవలం డిగ్రీ చదివి గృహిణిగా ఉన్న నాపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకం వర్ణించలేనిది. మహిళా శక్తిపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం. 1994లో హెరిటేజ్ సంస్థలో కేవలం 400మంది పాడిరైతులు ఉండేవారు. అప్పుడు హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ రూ.12కోట్లు మాత్రమే. నేడు 11రాష్ట్రాల్లో హెరిటేజ్ కంపెనీ ఉంది. నేడు కంపెనీ టర్నోవర్ రూ.2,789కోట్లకు పెరిగింది. 10చేతులు కలిస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి హెరిటేజ్ కంపెనీ ఓ నిదర్శనం. 3లక్షల మంది రైతులు, మేము, సిబ్బంది ఓ టీమ్ గా పనిచేయడం వల్ల కంపెనీ ముందుకు వెళుతుంది. పాడిపంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి..రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు, నెయ్యి అమ్ముకుని కుటుంబాలను నడిపేవారు. నేడు కూడా మహిళలు భర్త సంపాదనపై ఆధారపడకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో కూడా మేం వ్యాపారం చేస్తూ మగవాళ్లపై ఆధారపడకుండా ఉన్నాం. నేను, నా కోడలు వ్యాపారం చేస్తున్నాం. గతంలో ఆడపిల్లలను చిన్న చూపు చూసి చదువు చెప్పించేవారు కాదు..కేవలం ఇంటి పనులు నేర్పించి వంటింట్లో కూర్చోబెట్టేవారు. నేడు మహిళలు చదువుల్లో ముందు ఉన్నారు. మహిళలు మీ ఆడపిల్లల్ని బాగా చదివించి భవిష్యత్తులో ముందుకు నడిపించాలని నా మనవి. మహిళలు ఏ పనిలో అయినా, ఏ రంగంలో అయినా రాణించగలరు. నాన్న గారి ఆశయాల సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును చంద్రబాబు నిర్మించారు. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వినుకొండలో 12మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చాం. హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నెలకొల్పాం. ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్ 6 నుండి ఇంటర్ వరకు నడుపుతున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి మహిళలకు ప్రత్యేకంగా కాలేజీ నడిపిస్తున్నాం. స్కూలు, కాలేజీల ద్వారా వచ్చే లాభాల్లో ఏపీలోని చల్లపల్లి గ్రామంలో అనాధ పిల్లలకు, అనాధలకు సేవా కార్యక్రమాలు, ప్రతియేటా 360మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం. మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దు…భవిష్యత్తులో మహిళలంతా ముందుకు వెళ్లాలి. భావితరాన్ని నిర్మించి, ముందుకు నడిపే శక్తిని దేవుడు మహిళలకే ఇచ్చారు…దీన్ని మహిళలు ఎవరూ మర్చిపోవద్దు.
అమరావతే రాజధాని…చంద్రబాబే అమరావతిని నిర్మిస్తారు:
1500రోజులుగా అమరావతి రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న పోరాటాలు వృథా కావు. అమరావతి రైతుల పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి నా పాదాభివందనం. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశమే…అమరావతిలో రాజధానిని నిర్మించేది చంద్రబాబే. చంద్రబాబు ఒక్కడిని నమ్మి అమరావతి రైతులు 33వేల ఎకరాలను ఇచ్చారు. చంద్రబాబుపై అమరావతి రైతులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు. చంద్రబాబు చెప్పారంటే…చేసి తీరుతారంతే… చంద్రబాబు కుటుంబం గురించి ఆలోచించరు. ఆయన ప్రజల మనిషి…నిరంతరం రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచిస్తారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటాలను వైసీపీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా అణిచివేయాలని చూసింది. పోలీసులను ఉద్యమకారులపైకి ఉసిగొల్పి..మహిళలు అని కూడా చూడకుండా కిరాతకంగా వ్యవహరించారు. మహిళలను అక్రమంగా హింసించి, అరెస్టు చేసి, అక్రమ కేసులు పెట్టి, రాత్రిపూట కూడా స్టేషన్లలో పెట్టిన పోలీసులు ఏం సాధించారో చెప్పాలి? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైసీపీ పాలకుల మాటలు విని రాక్షసుల్లా వ్యవహరించడం బాధాకరం. వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంత గౌరవమో అమరావతి ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన తీరు అద్దం పడుతుంది. రాష్ట్ర ప్రజలకు రెండో ఆలోచన అవసరం లేదు. అమరావతే మన రాజధాని.
మా కుటుంబంపై మీరు చూపించే అభిమానాన్ని మరువలేను:-
మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు, మహిళలు మాపై చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను. మాకు ధైర్యం చెప్పి, మా వెన్నంటి నిలిచిన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా కుటుంబంపై రాష్ట్ర ప్రజలు చూపించే ప్రేమాభిమానాలకు మేం రుణపడి ఉంటాం… అని భువనమ్మ అన్నారు. అనంతరం మహిళా పాడిరైతులు అడిగే ప్రశ్నలకు బదులిచ్చారు.
శేషకుమారి, వెంకటపాలెం గ్రామం: నేను గేదెల్ని మేపి పాల వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను. మీరు మాలాంటి వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారు?
భువనమ్మ: నేను, నా కోడలు ఇద్దరం కలిసి మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా కంపెనీల్లో హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ లో మహిళలకు అవకాశాలు ఇస్తున్నాం. హెరిటేజ్ కంపెనీ నుండి ఆవులు, గేదెలు కోసం మహిళలు ముందుగానే అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. వారికి మేము గేదెలు, ఆవులు పెట్టుకునేందుకు ఆర్థికసాయం అందిస్తున్నాం.
మనీషా, వెంకటపాలెం: గతంలో మీరు ఎన్నడూ రాజకీయాల్లోకి, బయటకు రాలేదు..నేడు ఎందుకు వచ్చారు? మీరు ఎలా భావిస్తున్నారు?
భువనమ్మ: కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నన్ను పిలిచి పార్టీ బిడ్డలు చనిపోయారు. వారి ఇంటికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చి ఆర్థికసాయం చేసి రావాలని ఆదేశించారు. అందుకే నేను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి, కార్యకర్తల మధ్యలోకి వచ్చాను.
శైలజ, వెంకటపాలెం గ్రామం: అమరావతి ఉద్యమానికి మీరు మీ చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. మాకు సంఘీభావం తెలిపి, ధైర్యం చెప్పారు. రానున్న కాలంలో అమరావతి రాజధానిగా ఉంటుందా?
భువనమ్మ: అమరావతే రాజధానిగా ఉంటుంది…రెండో ఆలోచన అవసరం లేదు. చంద్రబాబు ఒక్కడినే నమ్మి 33వేల ఎకరాలను మీరు ఇచ్చారు. చంద్రబాబు ప్రజల మనిషి..ఆయన చెప్పాడంటే…చేస్తాడంతే…రానున్న కాలంలో గెలిచేది టీడీపీనే…అమరావతిని మనమే నిర్మిస్తాం.
టీడీపీ కార్యకర్తల్ని ఆదుకుంటున్నందుకు భువనమ్మకు నిండు కృతజ్ఞతలు:
- తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ టీడీపీ ఇన్చార్జి
టీడీపీ జాతీయ అధ్యక్షులు, అమరావతి నిర్మాత నారా చంద్రబాబునాయుడు గారు అక్రమంగా అరెస్టు కాబడిన సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాల వద్దకు నేరుగా వచ్చి పరామర్శించి, ధైర్యం చెప్పి, ఓదార్చి, ఆర్థికసాయం అందిస్తున్న భువనమ్మకు తాడికొండ నియోజకవర్గం తరపున, రాష్ట్ర ప్రజల తరపున నా నిండు కృతజ్ఞతలు. బాధితుల అకౌంట్లలోకి ఆర్థికసాయం పంపిచే అవకాశం ఉన్నా..కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ..నేరుగా కార్యకర్తల ఇళ్లకు వచ్చి పరామర్శించడం భువనమ్మలోని గొప్ప మనస్తత్వానికి ధన్యవాదాలు. నిజం గెలవాలి కార్యక్రమం మరింత విజయవంతం కావాలని కోరుతున్నాను.
రాష్ట్ర భవిష్యత్తు కోసం పరితపించే వ్యక్తి భువనమ్మ:
- పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ
తండ్రి, భర్త ముఖ్యమంత్రులైనప్పటికీ ఆ దర్పాన్ని ఎక్కడా చూపించకుండా ఉండే అతి సామాన్యురాలు భువనమ్మ. రాష్ట్ర భవిష్యత్తు కోసం భర్త ఆదేశాలను తూచా తప్పకుండా కుటుంబాన్ని, వ్యాపారాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న భువనమ్మ గొప్పతనాన్ని వర్ణించలేం. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతున్న తరుణంలో తన కుమారుడిని పాదయాత్రకు పంపడానికి మనసులో బాధ, భయం ఉన్నా ఆశీర్వదించి పంపిన త్యాగమూర్తి భువనమ్మ. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుకు, లోకేష్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ..నిజం గెలవాలి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న భువనమ్మకు కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు.