మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే జగనన్న లక్ష్యం
వైకాపా ఇన్చార్జ్, చైర్మన్లు
పులివెందుల
మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాల అందిస్తూ మహిళలకు అండగా, మాట తప్పని మడమ తిప్పని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని మున్సి పల్ ఇన్చార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ లు పేర్కొన్నారు. బుధవారం బ్రాహ్మణపల్లి రోడ్డు సమీపంలో ఉన్న శ్రీకర్ కళ్యాణ మండపంలో మెప్మా ఆధర్వంలో, వైయస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలను నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి,చైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ హఫీజ్, మెప్మా పీడీ సురేష్ రెడ్డి,కమీషనర్ వెంకట రమణారెడ్డి లు హాజర య్యారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు డ్వాక్రా సంఘాల మహిళలకు విడతల వారీగా రుణమాఫీ చేయడం చెప్పిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ముఖ్య ఉద్దేశంతో మహిళ లకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా నిలిచింద న్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు అని నమ్మిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే ఇలాంటి పథకాలు మరెన్నో అందుతాయి అన్నారు.అంతకుముందుగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం వైయస్సార్ ఆసరా నాలుగో విడత కు పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన 9 కోట్ల 59 లక్షల మెగా చెక్కును డాక్రా మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో , జెసిఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్, చంద్రమౌళి, కౌన్సిలర్లు కోడి రమణ,లక్ష్మీ భార్గవి,లక్ష్మీ ప్రసన్న , ఖాదర్, కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి, మెప్మా అధికారులు నాగన్న, నాయుడు, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.