వేంపల్లె:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమాజంలో ఉన్న అభాగ్యులకు, నిస్సహాయులకీ మరింత చేయూత లభించడం హర్షణీయమని ఫారెస్టు బీట్ అధికారి ఏ. మధు తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మాసాంతర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి తరంలో ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అనాధలుగా బ్రతుకుతున్నారని, వారికి మేము సైతం అంటూ మానవత అండగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావం, దృక్పథం కలిగిండాలన్నారు. మానవసేవే మాధవ సేవగా నమ్మిన సేవకులంతా ఆదర్శంగా ముందుకెళ్లి.. భావితరాలకు మార్గదర్శకులు కావాలని కోరారు. అలాగే మానవత ద్వారా అందుతున్న వివిధ సేవ కార్యక్రమాలు ప్రశంసనియమన్నారు. భవిష్యత్తులో కూడా అదేతరహగా సేవా కార్యక్రమాలు అందించాలని కోరారు. అనంతరం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవత ఛైర్మన్ బి.చక్రపాణిరెడ్డి, అధ్యక్షుడు చల్లా బాలాజీ, డైరెక్టర్లు డాక్టర్ రంగయ్య, డాక్టర్ రాజారాం, అనిల్ కుమార్ రెడ్డి, కోశాధికారి శ్రావణ్ కుమార్, ఆయా సభ్యులు గంగయ్య, చలపతి, డాక్టర్ అరుణ్, గోపి, వెంకటేష్, రామయ్య, వెంకట రమణ, రామ, శివ, బాబు, శ్రీనివాసులు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.