Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంమానవ జన్మకు సార్ధకత ఏమిటి?

మానవ జన్మకు సార్ధకత ఏమిటి?

అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్..!!!
పుణ్య పాప రూప కర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీరాల్సిందే…
కార్య కారణముల గొలుసే కర్మ. మనం చేసే పనే కాదు, చేయాలనే ఆలోచన, దాని ఫలితం కూడా కర్మను అనుసరించి వస్తుంది…

కర్మలు మూడు విధాలు..!!

సంచితం,
ప్రారబ్ధం,
ఆగామి…
ఇంతకు ముందు అనాది జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు.

ఇందులోంచి ఈ జన్మలో ఈ శరీరముతో అనుభవించేదంతా ప్రారబ్ధం.

ఈ జన్మలో చేసినది వెనక నిలువలో కలిసి రాబోయే జన్మలో అనుభవించ వలసినది ఆగామిగా చెబుతారు…

మామిడి పళ్ళ కాపు నుండి పండిన మామిడి పండ్లను తీసి ఇచ్చినట్లుగా, భగవంతుడు ప్రతి జీవికి వాని కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు…
ఏ కర్మఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయించేది భగవానుడే.

గత జన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలములు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే, ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నాడు, శాంతిని పొందుతున్నాడు.

గత జన్మలలో చేసిన పాపకర్మలు, ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మానవుడు కష్టాలుపడుతూ, కన్నీళ్ళు పాలవుతున్నాడు.

అందుచేత చేసే ప్రతి మంచిపని ఆ భగవంతుడే చేయిస్తున్నాడనీ, ఆ పని ఫలితం ఏదైనా వాడికే చెందుతుందని బాధ్యత అంతా వాడిదేనని, తాను భగవంతుడి చేతిలో ఒక పని ముట్టు మాత్రమేనని దృఢంగా విశ్వసించి భగవత్, భాగవత (భక్త), ఆచార్య కైంకర్య రూపంగా అన్ని పనులూ చేయాలి.

భగవంతుడే అనుగ్రహించి కావలసినవన్నీ తానే ఇచ్చి, పూర్వకర్మలన్నింటిని తొలగించి, తనతో చేర్చుకుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మాధవసేవగా సర్వప్రాణికోటి సేవ చేయడమే మనిషికి భగవంతుడు అనుగ్రహించే వరం.
అదే మానవ జన్మకు సార్ధకత…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article