యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలి
రాప్తాడు ;
నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో బిజెపి నియోజకవర్గం కో కన్వీనర్ కృష్ణం రెడ్డి పల్లి కాటమయ్య అధ్యక్షతన శుక్రవారం మెగా కంటి వైద్య శిబిరాన్ని సమదృష్టి క్షమత వికాసం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుమతి , అనంతపురం పార్లమెంట్ కన్వీనర్ లలిత్ కుమార్ , బిజెపి సీనియర్ నాయకులు గొంది అశోక్ కుమార్, సర్పంచ్ సాకే తిరుపాల్ హాజరయ్యారు .ఈ సందర్భంగా వారు వైద్య పరీక్షలకు వచ్చిన వైద్యులకు రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం పెట్ల శుద్ధ వహించాలని సూచించారు ఈ సందర్భంగా వైద్యులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి మెరుగైన వైద్య చికిత్సలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకునే విధంగా వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు అంతేకాకుండా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలు చేసి రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించిన వైద్య సిబ్బందికి అదేవిధంగా కృష్ణం రెడ్డి పల్లి కాటమయ్యకు అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా యువత సమాజ సేవలో భాగస్వాములై దేశానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు . 120 మందికి వైద్య పరీక్షలు అనంతరం 50 మందిని ఉచిత కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు . ఈ కార్యక్రమంలో పర్యవేక్షకుడు సూర్య ప్రకాష్ రెడ్డి అజీష్ యాదవ్ , మండల యువ మోర్చా కేశవ సాయి తదితరులు పాల్గొన్నారు