రామచంద్రపురం :తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో
వెంకట రామాపురం పంచాయతీలో టీడీపీకి చెందిన 45 కుటుంబాలు
వైకాపాలు చేరిక సీఎం జగనన్న పాలనకు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిదా అయ్యారు. సంక్షేమ పథకాల అమలు, పట్టణాలతో పోటీ పడేలా పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యారు. వెంకట రామాపురం పంచాయతీ మొహంతి వారి పల్లిలో ఉన్న టీడీపీకి చెందిన 45 కుటుంబాలు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భరోసా కల్పించారు. మీ భవిష్యత్తుకు నా భరోసా అంటూ హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కరోనా సమయంలో నా ప్రజలు, నా కుటుంబంగా భావించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరితపించారని తెలియజేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు తదితరాలు అందజేశారని తెలిపారు. అంతే కాకుండా కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మెడిసిన్స్ అందజేశారు. ఆనందయ్య మందును స్యయంగా తయారు చేయించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించారన్నారు. ఇంత చేసిన మా ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీ తో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
ఆర్సీ పురం మండలం.. వెంకట రామాపురం పంచాయతీ మొహంతి వారి పల్లిలో 45 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలు ఏకంగా వైఎస్ఆర్సీపీ లో చేరారు. ఇప్పటి వరకు టీడీపీ మద్దతుగా ఉన్న ఆ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. పార్టీలో చేరే కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ లో చేరిన వారిలో మాజీ సర్పంచ్ చిట్టిబాబు, జనార్ధన్, మని, వెంకటేష్, రాజేష్, గోపి, మాధవయ్య, సుందరం, మురళి, సుబ్బయ్య, ప్రతాప్, అయ్యప్ప, వెంకటయ్య, బాబు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి , మాజీ ఎంపీపీ దామోదర్ రెడ్డి, భాను కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ కుప్పం భాస్కర్ యాదవ్, రావిళ్ల వారి పల్లి పంచాయతీ కన్వీనర్ వెంకటేష్ నాయుడు, మార్కెట్ వైస్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి
జిల్లా మహిళా ఉపాధ్యక్షులు జ్యోతి, పులిగుంట కమిటీ ఛైర్మెన్ మహిధర రెడ్డి, జానకి రామ్, పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు.