ఎస్ఐ నాగ మురళి
కలసపాడు : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా సోమవారం కలసపాడు మండలం లోని గంగాయపల్లే గ్రామంలోఎన్నికల సందర్భంగా కలసపాడు ఎస్సై నాగమురళి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై నాగ మురళి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ఎలాంటిఘర్షణలు జరుగ కుండా గుంపుల గా ఒక చోటు చేరుకుని భేషజాలకు ఇతరులకు గ్రామ ప్రజలకు ఆటంకాలు సృష్టించడం గుంపులు కూడి ఘర్షణలకు దిగకుండా మాదక ద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉండాలని ఎవరి ద్వారా ఎలాంటి సంఘటనలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగమురళి వివరించారు.అనంతరం రానున్న ఎన్నికల స్థితిగతులపై ప్రజలను చైతన్య వంతులయ్యే విధంగా ప్రజలకు వివరించారు. గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలని అనుసరించి బేసిజాలకు పోకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,ఈకార్య క్రమం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.