Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలురామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలో తరలిస్తున్న 370 కేజీల గంజాయి స్వాధీనం..

రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలో తరలిస్తున్న 370 కేజీల గంజాయి స్వాధీనం..

జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేటమండలంలోని రామవరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హర్యానా రాజస్థాన్ దాబా హోటల్ వద్ద ఒక కంటైనర్ లారీలో ప్రత్యేక అర ద్వారా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి సీఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం హర్యానా కు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా లోని చిత్రకొండ గ్రామంలో మోటూ అనే వ్యక్తి వద్ద 370 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు జగ్గంపేట సిఐ లక్ష్మణరావు తెలిపారు. అయితే మోటు అనే వ్యక్తి ఈ యొక్క గంజాయిని ముందు రోజు గండేపల్లి మండలం మురారి గ్రామంలోని పోలవరం కెనాల్ వద్ద తీసుకువచ్చి తుప్పల్లో దాచి ఇద్దరు వ్యక్తులకు సరుకు అప్పగించడం జరిగిందని అదే రోజు ఇబ్రహీం, జూన్డ్ లు
మహారాష్ట్రకు చెందినటువంటి సీక్రెట్ అరతో కూడి ఉన్న కంటైనర్ లారీలో ఈ యొక్క గంజాయిని నింపుకొని తరలిస్తుండగా మార్గం మధ్యలో లారీ మరమ్మతులకు గురవడంతో రామవరం హర్యానా రాజస్థాన్ దాబా వద్ద లారీకి రిపేరు చేస్తుండగా అందులో గంజాయి తరలిస్తున్నట్లు జగ్గంపేట పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట ఎస్సై నాగార్జున రాజు సిబ్బందితో దాడులు నిర్వహించడం జరిగిందని సీఐ తెలిపారు.ఈ ఘటనలో ఇబ్రహీం, జూన్డ్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సుమారు 7 లక్షల 50వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా గంజాయి తరలిస్తున్న కంటైనర్ లారీ ,మూడు సెల్ ఫోన్లు,1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
వీరిని కోర్టులో హాజరు పరచగా గౌరవ మెజిస్ట్రేట్ వారు రిమాండ్ విధించినట్లు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి గంజాయి సరఫరా చేసిన మోటో అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలో అతన్ని అరెస్టు చేయడం జరుగుతుందని సీఐ లక్ష్మణరావు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article