Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలురాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం కావాలంటే జగన్ కావాలి.

రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం కావాలంటే జగన్ కావాలి.

మాజీ మంత్రి తోట నరసింహం.
గండేపల్లి:గండేపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జి తోట నరసింహం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమo రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచినట్లు తెలియజేశారు.పైన ఆ దేవుడిని, ఇక్కడ ప్రజల్ని నమ్ముకుని ఎన్నికలకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.ఏ నాయకుడు చెప్పని విధంగా తనవల్ల ఆయా కుటుంబాలకు మేలు జరిగితేనే తనకు ఓటు వేయమంటూ అడిగే దమ్మున్న నేతగా కొనియాడారు. ఈ విధంగా చంద్రబాబు చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. దమ్ము ధైర్యంతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కులాలకు పార్టీలకు అతీతంగా వైసిపి ప్రభుత్వం పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందజేసిందని పేర్కొన్నారు. అనంతరం మండలంలో 3,138 మహిళలకు 5 కోట్ల 88 లక్షల రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు తోటరాంజి, ఎంపీపీ చలగళ్ళ దొరబాబు, వైస్ ఎంపీపీ బిట్రా వెంకట లక్ష్మీ రమణ, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, మద్ధిపట్ల రామకృష్ణ,రుత్తుల లలిత,కుంచే చినబాబు, తాళ్లూరి మధు కుమార్, కోర్పు దుర్గాప్రసాద్, ఎంపీడీవో హనుమంతరావు, ఏపీఎం సన్యాసిరావు, సీసీలు,వివోఏ లు, వెలుగు సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article