రుడా వైస్ ఛైర్మన్ గా బాలాస్వామి
- ఎంపీ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వైస్ ఛైర్మన్
ప్రజాభూమి రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) వైస్ ఛైర్మన్ గా డీ బాలాస్వామి నియమితులయ్యారు. మంగళవారం రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ ను డీ బాలాస్వామి ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రుడా వైస్ ఛైర్మన్ ను అభినందిస్తూ రుడా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి ఉన్నారు. రుడా వైస్ ఛైర్మన్ గా నియమితులైన బాలాస్వామి తాడేపల్లిగూడెం కమిషనర్ గా పనిచేస్తూ ఇక్కడకు రుడా వైస్ ఛైర్మన్ హోదాలో బదిలీపై వచ్చారు. అదే విధంగా ఇప్పటి వరకూ రుడా వైస్ ఛైర్మన్ గా రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ టీ దినేష్ కుమార్ (ఐఏఎస్) బాధ్యతలు నిర్వహించారు. ఇకపై ఆయన కమిషనర్ గా యధావిధిగా కొనసాగుతారు.