Tuesday, April 22, 2025

Creating liberating content

సినిమాలావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్

లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సిరీసుకు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేయగా.. బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ విన్నర్ అభిజీత్ దుద్దాల హీరోగా చేస్తున్నాడు. అలాగే యూట్యూబ్ వెబ్ సిరీసులతో బాగా పాపులర్ అయిన అభిజ్ఞ ఉతలూరు మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీసులో యాక్టర్ హర్షవర్దన్, ఝాన్సీ, హర్ష్ రోషన్, మహేశ్ విట్టా, సతీష్ సారిపల్లి తదితరులు పలు పాత్రల్లో నటించారు.
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే వైజాగ్ బీచ్‌లో క్లీన్ చేసి డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేసింది లావణ్య త్రిపాఠి. ప్రమోషన్స్‌లో భాగంగానే హీరో అభిజీత్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి గురించి చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ తెలుగు విన్నర్ అభిజీత్.
“లావణ్య త్రిపాఠి నటన అంటే నాకు ఇష్టం. తను మంచి కోస్టార్. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేసే క్రమంలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను, తను దాదాపు ఇద్దరం ఒకే టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. అయితే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్‌ను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు” అని అభిజీత్ తెలిపాడు.
“ఈ సిరీస్‌కు సుప్రియ గారు ప్రొడ్యూసర్ కావడం హ్యాపీగా ఉంది. నాకు మంచి కథ దొరికితే నేను ఆ కథను తీసుకెళ్లే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్‌లో సుప్రియ గారు ఒకరు. కానీ, నాకు బాగా అనిపించిన సబ్జెక్ట్ మాత్రమే అలా తీసుకెళ్తా. ఎందుకంటే ఒక ఫ్లాప్ సినిమా మంచి రిలేషన్ కూడా పోగొడుతుంది. అందుకే నేను సినిమా సెలెక్షన్‌లో జాగ్రత్తగా ఉంటా. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అధీప్ గారు మిస్ పర్ఫెక్ట్ కథ నెరేట్ చేసినప్పుడే చాలా హిలేరియస్‌గా అనిపించింది. నటిస్తున్నప్పుడు మేము ఆ మ్యాజిక్ ఫీల్ అయ్యాం. రేపు సిరీస్ చూస్తూ మీరు అదే ఫీలయితే మా టీమ్ అంతా సంతోషిస్తాం” అని అభిజీత్ అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article