నియోజకవర్గ మాజీ కన్వీనర్ ముత్తారెడ్డి
చింతలపూడి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావాన్ని విజయవంతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డిపిలుపునిచ్చారు.చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి లో చేపట్టిన శంఖారావం ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువులధరలు, నిరుద్యోగంతో యువత పడుతున్న ఇబ్బందులు గూర్చి ప్రజలకు భరోసా కల్పించేలా,బాబు భరోసా భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ సాగే శంఖారావ యాత్రకు ప్రజలంతా అండగా ఉండాలని జగ్గవరపు ముత్తారెడ్డికోరారుఎర్రగుంటపల్లి గ్రామంలో వైసిపి ప్రభుత్వ చర్యలకు విసిగి వేసారి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పసుపు కండువా మెడలో వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోతెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను యువతకు వివరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని వచ్చే ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీ గెలుపు తప్పనిసరి అని , రాష్ట్ర పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని పంపించినా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతూ
వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోండ్రు దేవా ,పట్టణ అధ్యక్షులుపక్కాలవెంకటేశ్వరరావు,రైతుజిల్లాప్రధానకార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఆది జగన్, మాజీ జడ్పిటిసి తాళ్లూరి రాధా రాణి, శాంతా రెడ్డి,స్థానిక ఎంపీటీసీ తులిమెలి భాస్కర్, ప్రగడవరం గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లూరుచంద్రశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి,పల్లె మున్న ఎంపీటీసీ ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు అప్పిరెడ్డి నాగు తదితరులు పాల్గొన్నారు.