Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుల్యాబ్ టెక్నీషియన్లకు ఇచ్చిన నోటీసులపై పునరాలోచించాలి

ల్యాబ్ టెక్నీషియన్లకు ఇచ్చిన నోటీసులపై పునరాలోచించాలి

జిల్లా వైద్యశాఖ అధికారికి వినతి

కడప సిటీ

జిల్లాలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు ఇచ్చిన నోటీసులపై పునరాలోచించాలని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి. ఎం.ఓబులేసు సిఐటియు నగర అధ్యక్షులు పి.చంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐనగర కార్యదర్శి డి. ఎం.ఓబులేసు సిఐటియు నగర అధ్యక్షులు పి.చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు ఎం ఎల్ టి, డి ఎం ఎల్ టి, బి ఎస్ ఎం ఎల్ టి లాంటి వృత్తిపరమైన కోర్సులు చదివి ఉత్తీర్ణులై సర్టిఫికెట్లు పొందిన చాలామంది యువత నిరుద్యోగులుగానే ఉన్నారు. వారు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి నియామకాలు లేక స్వతంత్రంగా తమ జీవనం గడపడానికి మెడికల్ ల్యాబ్స్ చాలా సంవత్సరాలుగా జిల్లాలో వందకు పైగా నడుపుకుంటున్నారు,
ఈ సందర్భంలో ఇటీవల పెథాలజిస్టులంతా సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు ప్రతి మెడికల్ ల్యాబ్ వారు తప్పకుండా పెథాలజిస్టును నియమించుకోవాలని తీర్పు ఇచ్చిందని, దానికి అనుగుణంగానే జిల్లా వైద్య శాఖ అధికారి నిరుద్యోగులైన ల్యాబ్ టెక్నీషియన్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది.
టెక్నీషియన్లకు ఇచ్చినటువంటి నోటీసులపై మరో ఒకసారి పునరాలోచించాలని ఆ వృత్తి విద్యలో ఉత్తీర్ణులై,నిరుద్యోగులైన వారిని రోడ్డున పడేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకుని నడుపుతున్న ల్యాబ్స్ ని యధావిధిగా పని చేసుకునే విధంగా ఆనుమతి ఇవ్వాలని కోరారు. ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ప్రజల రక్తపరీక్షలన్నిటిని ఖచ్చితమైన ప్రమాణాలను పాటిస్తూ వారికి నాణ్యమైన సేవలు అందించాలని అప్పుడే మనం మన వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని,కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో మనం సేవలు అందించామని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article