Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలువాస్తవ పరిస్థితులకు… గవర్నర్ ప్రసంగానికిలోయకు.. ఎవరెస్ట్ శిఖరానికి ఉన్నంత తేడా ఉంది : నిమ్మల రామానాయుడు

వాస్తవ పరిస్థితులకు… గవర్నర్ ప్రసంగానికిలోయకు.. ఎవరెస్ట్ శిఖరానికి ఉన్నంత తేడా ఉంది : నిమ్మల రామానాయుడు

అమరావతి:

“ గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకే. పాదయాత్రలో ఎలాగైతే జగన్ రెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో, అదే విధంగా నేడు ముఖ్య మంత్రిగా ఉండి గవర్నర్ తో కూడా అలానే అబద్ధాలు చెప్పించాడు. అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి, దాని దిగువన ఉండే లోయకు మధ్య ఎంతదూరం ఉంటుందో, అదేవిధంగా వాస్తవాలకు, గవర్నర్ ప్రసంగానికి మధ్య తేడా ఉంది. నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో ఈ ప్రభుత్వం అసత్యాలు పలికించింది అని టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు అన్నారు.శానససభ, శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు ప్రజల్ని మోసగించడానికి జగన్ రెడ్డి, ఏకంగా గవర్నర్నే వినియోగించుకోవడం సిగ్గుచేటని అన్నారు. అమ్మఒడి పథకం సాయం అందుకునే తల్లులు 43.61 లక్షల మంది అయినప్పుడు విద్యార్థులు 83లక్షలు ఎలా అయ్యారో జగన్ రెడ్డి చెప్పాలినాడు-నేడు పథకం గురించి గవర్నర్ తో గొప్పగా చెప్పించారు. వాస్తవంలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలు మూతపడి లక్ష లాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. దళిత, బడుగుబలహీన వర్గాల పిల్లలకు ప్రాథమికవిద్యను ప్రభుత్వం అందుబాటులో లేకుండా చేసింది. అమ్మఒడి గురించి కూడా అబద్ధాలు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో 43.61 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద ఆర్థికసాయం అందిస్తున్నట్టు చెప్పారు. 83లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతోందని చెప్పించారు. అమ్మఒడి కింద ఏటా ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున ఇస్తాన న్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్కరికే అన్నాడు. రూ.15 వేలను ఇప్పుడు రూ.13వేలు చేశాడు. ఆ సొమ్ముకూడా అందరికీ సక్రమంగా ఇవ్వడం లేదు. 43లక్షల తల్లులకు ఇస్తున్నప్పుడు బిడ్డలు కూడా 43లక్షలే ఉండాలి. 83లక్షల మంది ఎలాఅయ్యారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్నికల ముందు మరోసారి మోసగించడానికి ఏకంగా ఈ ముఖ్యమంత్రి గవర్నర్నే వినియోగిం చుకోవడం సిగ్గుచేటు. ఫీజు రీయింబర్స్ మెంట్ అద్భుతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. జగనన్న విద్యాదీవెన అని పేరుమార్చి, ఒకసారి కాకుండా నాలుగుసార్లు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఇస్తున్నారు. సంవత్సరంలో నాలుగుసార్లు ఇస్తూ, 4 సార్లు పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తూ, ప్రజలసొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగో విడత ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వమని కళాశాల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశీ విద్య పథకానికి పేరుమార్చడం తప్ప, దళిత.. బీసీ.. మైనారిటీ విద్యార్థులకు జగన్ రెడ్డి రూపాయి ఇచ్చిందిలేదువిదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుతీసేసి, జగనన్న విదేశీ విద్య అని ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నాడు. పేరు మార్చడంతో పాటు దళితులు, బీసీలు, మైనారిటీల విద్యార్థులకు పథకం కింద నిధులు ఇవ్వడం ఆపేశాడు. విదేశాలకు వెళ్లి చదువుకో కుండా వారి ఆశలపై నీళ్లు చల్లాడు. అలానే ఈప్రభుత్వంలో ఎస్సీకార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఏవీ లేవు. చంద్రబాబు హాయాంలో కాపులు, బ్రాహ్మణలు, వైశ్యులకుకూడా కార్పొరేషన్లు పెడితే, జగన్ ఒక్క కార్పొరేషన్ కూడా లేకుండా చేశాడు. ఉన్న కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల్లో ఒక్కరికి కూడా రూపాయి అదనంగా ప్రభుత్వం ఇచ్చిందిలేదు. కానీ గవర్నర్ ప్రసంగంలో నిధులు ఇస్తున్నట్టు చెప్పించారు.గవర్నర్ ప్రసంగంలో కౌలురైతుల ప్రస్తావన లేదు. కౌలురైతుల్ని మర్చిపోయిన ఈ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హతలేదు జగన్ జే ట్యాక్స్ కట్టలేక ఆక్వారైతులు హాలిడే తీసుకున్నారు రైతుభరోసా కింద ఏటా ప్రతి రైతుకి రూ.13,500లు ఇస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించారు. కేంద్రం ఇచ్చే సొమ్ముని ముఖ్యమంత్రి తన గొప్పగా చెప్పుకుంటు న్నాడు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కౌలు రైతుల ప్రస్తావన లేదు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండోస్థానంలో ఉంది. ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా గురించి ప్రసంగంలో చెప్పించారు. రైతుల తరుపున పంటల బీమాసొమ్ము కట్టడమనేదే ఈ ప్రభుత్వం మర్చిపోయింది. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో కూర్చొని నిరసన తెలిపితే, అప్పుడు అర్థరాత్రి ఆ సంవత్సరానికి బీమా సొమ్ము కట్టారు. తర్వాత నుంచీ మరలా మామూలే. కౌలురైతుని మరిచిపోయిన ఈ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఆంధ్రాని ఆక్వాహబ్ గా మార్చామని చెప్పుకుంటుంటే నవ్వాలో జాలిపడాలో తెలియడం లేదు. జగన్ జే ట్యాక్స్ దెబ్బకు ఆంధ్రావ్యాప్తంగా ఆక్వారైతులు హాలిడే తీసుకున్నారు. 61వేల మంది ఆక్వారైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. రాష్ట్రంలో 40 నుంచి 50లక్షల మంది ఆక్వా రైతులుంటే, వారిలో 60వేల మందికి ఇస్తే, ఆక్వారంగం మొత్తానికి ఇచ్చినట్టా? ఆక్వారంగానికి సంబంధించి విద్యుత్ సబ్సిడీ తీసేసింది కాక, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పిస్తారా?5 ఏళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తానన్న జగన్ రెడ్డి, ఆఖరికి చంద్రబాబు కట్టించిన ఇళ్లు కూడా పేదలకు ఇవ్వలేదుపేదలకు ఇళ్లు అంటూ ఎన్నికలకు ముందు కథలు చెప్పారు. అధికారంలోకి రాగానే సంవత్సరానికి 5లక్షల చొప్పున 5 ఏళ్లలో పేదలకోసం 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ రెడ్డే తన మేనిఫెస్టోలో చెప్పాడు. 5 ఏళ్లు పూర్తయ్యాయి. 25 లక్షల ఇళ్లు కట్టాల్సింది. .కనీసం వేలల్లో కూడా కట్టలేదు. ఇళ్లు కట్టకపోతే కట్టక పోయాడు.. చంద్రబాబు తన హాయాంలో పేదలకోసం కట్టించిన ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు కూడా పేదలకు ఇవ్వకుండా కక్షసాధింపులకు పాల్పడ్డాడు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకోవడం పచ్చి అబద్ధం కాదా? 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, కరెంట్ లేకుండా చేస్తున్నారని ప్రజలు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించారు. విద్యుత్ డిస్కంలను అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ ముఖ్యమంత్రి, 8 సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచాడు. నాణ్యమైన కరెంట్ కాదు… అసలు కరెంట్ ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఒకపక్క ప్రజలు విద్యుత్ కోతలు, పెంచిన ఛార్జీలపై ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తుంటే, గవర్నర్ తో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకు అందిస్తున్నట్టు అబద్ధాలు చెప్పిస్తారా?
గుంతలు లేకుండా 3వేల కిలోమీటర్లు రోడ్లు వేసినట్టు జగన్ రెడ్డి, గవర్నర్ ప్రసంగంలో చెప్పించి 8వ వింత సృష్టించాడుజగన్ రెడ్డి రాష్ట్రంలో 8వ వింత సృష్టించాడు. గుంతలు లేకుండా 3వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని గవర్నర్ తో చెప్పించారు. మరీ ఇంత అబద్ధమా? జగన్ రెడ్డి శ్రేయోభిలాషి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే ఏపీలో రోడ్లపై తిరిగి నడుములు పడిపోయాయని చెప్పారు. వాస్తవంలో పరిస్థితి దారుణంగా ఉంటే, గుంతలు లేని రోడ్లు వేశామని గవర్నర్ తో చెప్పించండం సిగ్గుచేటు. ఇన్ని అబద్ధాలు, అసత్యాలు వినలేకనే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశాం. బీఏసీ సమావేశాన్ని కూడా మేం బహిష్కరించాం. బీఏసీ సమావేశంల లో చెప్పేవి ఏవీ అసెంబ్లీలో అమలు కావడంలేదు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ కూడా ఇవ్వనీయకుండా జగన్ రెడ్డి శాసనసభను లోటస్ పాండ్ లా మార్చి, నియంత్రత్వ పాలన సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 10గంటలకు అసెంబ్లీ ప్రారంభం కావాలి.. కానీ ముఖ్యమంత్రి రాకకోసం 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. శాసనసభ అంటే గౌరవం లేని ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని ఎలాగైతే నాశనం చేశాడో, అదేవిధంగా అసెంబ్లీని కూడా భ్రష్టుపట్టించాడు.” అని రామానాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article