గొల్లప్రోలు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన వికలాంగునికి సాయి ప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్ చేయూతనందించారు. దుర్గాడ గ్రామానికి చెందిన అరట్లకట్ల స్వామి అంగ వైకల్యంతో నడవలేని స్థితిలో ఉండడంతో శ్రీనివాసుస్ అతనిని పరామర్శించి ఊతకర్రలు అందించడమే కాకుండా వైద్య సహాయం నిమిత్తం 3 వేల రూపాయలు అందజేసారు . ఈ కార్యక్రమంలో ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, గొల్లపల్లి గంగ బాబు, శాఖ సురేష్, కుమ్మరి గంగేశ్వరుడు, యదాల అప్పారావు, గంపల శివ, కుర్రు అప్పారావు,చేశెట్టి భద్రం, ఆకుల వెంకటస్వామి, మంతెన గణేష్, మేడిబోయిన హరికృష్ణ, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.