కామవరపుకోట:ప్రస్తుత సమాజంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలు కుటుంబాలే బలైపోతున్నాయి. ఆ తర్వాత జరిగేటటువంటి పరిమాణాలతో యావత్ ఆస్తిని పోగొట్టుకొని రోడ్డును పడుతున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కామవరపుకోట మండలంలోని ఎడవల్లి పంచాయతీ పరిధిలోగల వెంకటాపురం చెరువులో గుర్తుపట్టలేని అంత విధంగా సుమారు 45 సంవత్సరాలు వయసు కలిగిన యువకుడిని మొండేం వేరుచేసి కాల్చివేసిన అనంతరం చెరువులో పడేసినట్లు స్థానికలు గుర్తించారు. శరీరం పైన డ్రాయర్ తప్ప ఇంకేమీ లేదు నాలుగైదు రోజుల క్రితమే కాల్చివేసిన అనంతరం చెరువులో పడేసినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని తడికలపూడి పోలీసులకు తెలిపారు. తడికలపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసే పనులు నిమగ్నమయ్యారు.
తీవ్రత మైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప తల వేరుచేసి కాల్చి పడేసింత పరిస్థితి నెలకొంది అంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందని స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా పరిసర ప్రాంతాలలోని గ్రామాల, మండలాల వ్యక్తులు దృశ్యం అయినటువంటి కేసులను తీసుకుంటే ఈ మృతదేహం ఎవరిదో తెలిసే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ఒక పక్కన చాపలు తినేస్తూ ఉన్నాయి. శరీరం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది ఒంటిమిపైన ఒక్క డ్రాయర్ తప్ప మరేమి కనపడని విధంగా ఉంది. స్థానిక వీఆర్వో తడికలపూడి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది.