- స్వామివారి దివ్య కల్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ భరత్
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన కమిటీ, అర్చకులు
ప్రజాభూమి,రాజమండ్రి, : రాజమహేంద్రవరం నగర క్షేత్ర పాలకుడిగా పూజలందుకుంటున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి (గోదావరి గట్టు) వారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. ఈ కల్యాణ మహోత్సవానికి ఎంపీ భరత్ ఆయన మాతృమూర్తి ప్రసూన తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ, ఆలయ అర్చకులు ఎంపీ భరత్ ను ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేణుగోపాలస్వామికి, అమ్మవార్లకు కల్యాణ పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంపీ భరత్ సమర్పించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం ఎంపీ వీక్షించారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ, భక్తుల కోరిక మేరకు శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ అభివృద్ధికి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను చిన్నప్పుడు ఈ ప్రాంతంలోనే తిరిగానని, స్వామివారి ఆలయంలో ఆటలాడుకున్నానని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజమండ్రి నగర క్షేత్ర పాలకుడిగా అలరారే శ్రీ స్వామివారి ఆలయానికి గత వైభవాన్ని తీసుకువచ్చేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్ మాట ఇచ్చారు. అనంతరం ఎంపీ భరత్ ను, ఆయన మాతృమూర్తి ప్రసూనని ఘనంగా ఆలయ కమిటీ సత్కరించింది. ఈ కార్యక్రమంలో దుర్వాసుల సత్యనారాయణ, కొత్త బల మురళి, కొత్త విజయ్ రాజా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.