వేలేరుపాడు:మండల కేంద్రమైన వేలేరుపాడు సిపిఐ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు కంగాల గంగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎర్ర మధు బంధం నాగేశ్వరరావు మాట్లాడుతూ,
భగత్ సింగ్ వర్ధంతి స్ఫూర్తితో రానున్న కాలంలో నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు కి యువత సిద్ధం కావాలి అన్నారు
దేశంలో నిరుద్యోగం, పేదరికం లేని సమాజం కోసం కృషి చేయటమే భగత్ సింగ్ కి ఘనమైన నివాళిఅని,
భగత్ సింగ్ చేసిన త్యాగాలు నేటి యువత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు, భగత్ సింగ్ అంటే యువతకు ఉత్తేజమని, ప్రతి ఒక్కరు భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో జరుగుతున్న అసమానతలు, దోపిడి పైన నిర్వహించే పోరాటాల్లో యువత ముందుండాలని ఆయన తెలిపారు, భగత్ సింగ్ కలలు కన్నా సమాజం నేడు లేదని నేటి కార్పొరేట్ , పెట్టుబడిదారు లు లాభాల కోసం యువతను గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల, చెడు వ్యసనాల వైపు తీసుకెళ్లారని ఆరోపించారు, దీనివల్ల యువత మొత్తం పెడదారులు పట్టి ఆగమైపోతున్నారని భగత్ సింగ్ స్ఫూర్తితో యువతని సక్రమమైన మార్గాల్లో తీసుకురావడం కోసం అఖిల భారత విద్యార్ధి సమాఖ్య , అఖిల భారత యువజన సమాఖ్య అనేక పోరాటాలు చేస్తుందని, ఈ పోరాటాలు లో యువత మొత్తం కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లీ సాయిబాబు,మండల కార్యదర్శి బాడిశా రాము, రామవరం సర్పంచ్ పిట్టా ప్రసాద్,జిల్లా కౌన్సిల్ పిట్టా వీరయ్య,విద్యార్ధి,యువజన నాయకులు పిట్ట జయమ్మ,కరక మంగ, మడకం దుర్గారావు,బిమరాజు, లెనిన్,పాపారావు, తరుణ్,ముత్యలరావు, రాము, కారం ముత్యాల రావుతదితరులు పాల్గొన్నారు.