Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌ మీట్‌.

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌ మీట్‌.


ఆ మీడియా.. కరుడుగట్టిన పసుపు దండు బ్యాచ్..

  • ఎవరైతే కరుడుగట్టిన పసుపు దండు సభ్యులుగా ఉన్నారో.. వారు- ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 లాంటివాళ్లు అక్కడకు వెళితే ఎవరికైనా కచ్చితంగా ఆవేశం వస్తుంది.
  • వారు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు.
  • మీరేమో ఒక పక్క అవినాష్‌ నాటకాలు వేస్తున్నాడు అంటారు..ఆ సమయంలో మీరు కన్పిస్తే ఎవరికో ఆవేశం వస్తే దాన్ని మీడియా మీద దాడి.. అంటూ గగ్గోలు పెడుతున్నారు.
  • దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నిజమైన మీడియాపై ఎక్కడ ఏది జరిగినా బాధ పడతారు.
  • మీరు బాధ్యతాయుతంగా ఉండి…ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే దాన్ని ఖండించాల్సిందే.
  • అలాంటి అంశాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌ గారు సహించరు.
  • జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు. వందమందో, వెయ్యి మందో ఉన్న చోట ఖచ్చితంగా ఎవరో సంబంధం లేని వారు ఆవేశంగా రావచ్చు.
  • ఆ ఆవేశం వచ్చేటట్లు మనం ఎందుకు ప్రవర్తించాలి….?
  • అవినాష్ తల్లిగారి ఆరోగ్యం బాగోలేకపోయినా మీరు నాటకాలు అంటూ బ్రేకింగ్‌ లు వేసి, ఆ లోగో పట్టుకుని మళ్లీ అక్కడకు వెళ్లినప్పుడు కార్యకర్తలు ఆవేశపడటం సహజం.
  • ఎవరో ఒకరిద్దరు రియాక్ట్‌ అవ్వొచ్చు. దాన్ని ఖండిస్తాం. కానీ ఇలాంటి రాతలను కూడా ఖండించండి అని అడుగుతున్నా.
  • మొన్న కూడా తల్లికి ఆరోగ్యం బాగోలేక వెళ్తున్నాడు అని మీరే బ్రేకింగ్స్‌ వేశారు.
  • మళ్లీ మీరే వెంటపడి వెళ్లారు..అలా వెళ్ళాల్సిన అవసరం ఏముంది..?
  • ఆయనేమన్నా అండర్‌ గ్రౌండ్‌ నుంచి అప్పుడే బయటకు వచ్చాడా..?
  • గుత్తి వరకూ వెళ్లి బెంగుళూరు వెళ్తాడా..? మరో వైపు వెళ్తాడా అంటూ ఊహాగానాలు వేస్తారు.
  • ఎదురుగా మళ్లీ అదే మీడియా కన్పిస్తుంది… అలాంటప్పుడు ఏంటీ తప్పుడు రాతలనే కోపం ఎవరికైనా వస్తుంది.

రాష్ట్రపతి పాలన అని, కేంద్ర బలగాలు వస్తున్నాయని ఏమిటా రాతలు, కూతలు..?:

  • రాష్ట్ర పోలీసులు, సీబీఐకి సంబంధించి… వీళ్లేం కోరారు..వాళ్ళేం చెప్పారు అనేది ఆ రెండు శాఖల మధ్య విషయం.
  • బలగాలు వస్తున్నాయి అని రాశారు.. మరి ఎందుకు రాలేదు..?
  • కేంద్ర బలగాలు రావడం అనేది అంత సాధారణమా..?
  • సినిమాలకు థర్డ్‌ గ్రేడ్‌ రైటర్‌ కథలు రాసినట్లు వీళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు.
  • అసలు రాష్ట్రపతి పాలన పెట్టడం ఏంటి..? కేంద్ర బలగాలు రావడం ఏమిటి..?
  • ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది కూడా వీళ్ళు కనీసంగా ఆలోచించడం లేదు.
  • అవినాష్‌ రెడ్డి తనకు ఉన్న రైట్‌ ప్రకారం, విచారణకు మరికొద్ది సమయం కోరారు…అతనికి ఉన్న హక్కుల ప్రకారం కోర్టులకు వెళ్లవచ్చు.
  • రామోజీ మార్గదర్శి కేసును ఆపడానికి తట్టని కోర్టు తలుపులు లేవు. ఆయన చేస్తే న్యాయం. అవినాష్ రెడ్డి కోర్టుకు వెళితే అన్యాయమా.. ?
  • మార్గదర్శి విషయంలో మహిళ ఉద్యోగులు ఉంటే.. సీఐడీ వాళ్లు వచ్చి కూర్చున్నారు అని అంటారు.
  • అర్ధరాత్రి అవినాష్‌ ఇంటి డోర్‌కు నోటీసు అంటిస్తే…ఆ సమయానికి అవినాష్‌ లేకపోయినా కూడా, ఆయన తప్పే అన్నట్టుగా మీరే రాస్తున్నారు.

రామోజీకి ఒక న్యాయం..అవినాష్‌ కి మరో న్యాయమా..?

  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జీవో ఇచ్చాడు.
  • ఈనాడులో అప్పుడు కుక్కకు తోక కత్తిరించినట్లు పెద్ద కార్టూన్‌ కూడా వేశారు.
  • మళ్లీ ఇప్పుడు వారికి అదే సీబీఐ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.
  • రామోజీకి ఒక న్యాయం..అవినాష్‌ కి మరో న్యాయమా..?. రామోజీ న్యాయ పరంగా ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవచ్చు..కానీ అవినాష్‌ మాత్రం అలా చేయకూడదు అంటాడు.
  • అవినాష్‌ సమయం అడిగాడు..సీబీఐ సమయం ఇచ్చిందనుకో ప్రపంచం తలకిందులు అవుతుందా..?
  • రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, టీవీ5 నాయుడు తప్ప ప్రపంచంలో మిగిలిన వారంతా వారి దృష్టిలో అవినీతి పరులే.
  • వీళ్లు ఏ హక్కునకూ ఆర్హులు కారు.. కోర్టులకు వెళ్లకూడదు..అసలు ప్రజలు ఎన్నుకోడానికే వీళ్లేదు అంటాడు.
  • అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలులోనే ఎందుకు చేర్చారు అంటూ చర్చలు పెడుతున్నారు.
  • అసలు ఇప్పుడే ఆమెకు అనారోగ్యం ఎందుకు వచ్చిందని కూడా వాళ్లు అడుగుతారు.
  • బెంగుళూరు వెళితే పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్లారు..మన రాష్ట్రంలో వైద్యం లేదా అని కూడా రాస్తారు.
  • హైదరాబాద్‌ వెళ్తే కేసీఆర్‌ ఫ్రెండ్‌ కాబట్టి వెళ్లారు అంటారు.
  • వివేకా హత్య కేసులో కూడా వీళ్లే ట్రైల్‌ చేసి శిక్షలు కూడా వేసేస్తున్నారు.
  • వీళ్లు రాసే రాతల్లో, వీళ్ల కథనాలు, వీళ్ల డిబేట్లు అన్నిటి ఉద్దేశం ఒక్కటే.. ఎదుటి వారి వ్యక్తిత్వ హననం.
  • ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి వ్యక్తిగత అంశాలపైకి తిప్పుతుంటారు.

తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే డ్రామాలంటారా?

  • అవినాష్‌రెడ్డి ఇప్పటికి ఆరేడు సార్లు సీబీఐ విచారణకు వెళ్లాడు.
  • సీబీఐకి సహకరిస్తున్నారు..ఆయన ఎక్కడికీ పారిపోలేదు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నారు.
  • తల్లికి ఆరోగ్య బాగోలేదు.. తండ్రి జైళ్లో ఉన్నారు కాబట్టి తాను ఒక లేఖ రాసి సమయం అడిగారు.
  • అది కేవలం సీబీఐ, అవినాష్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారం.
  • ఒక వేళ వారు రాష్ట్ర పోలీసులతో మాట్లాడి ఉంటే చట్టప్రకారం వారి పని వారు చేసుకుంటారు.
  • సీబీఐ కానీ, ఇంకెవరూ దానిపై మాట్లాడటం లేదు.
  • అవినాష్‌ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీం కోర్టు.. హైకోర్టుకు వెళ్లమన్నట్లుంది.
  • ఈ ఎల్లోమీడియా మాత్రం కేంద్ర బలగాలు దిగుతున్నాయి అని రాస్తున్నారు.
  • వాళ్లే కేంద్ర బలగాలు వస్తున్నాయి అంటారు..మళ్లీ రాకుండా చేశారు అని కూడా వాళ్లే రాస్తారు.
  • నిన్నంతా ఆ రెండు మూడు చానళ్లు ఇష్టారీతిన డిబేట్లు పెట్టాయి.
  • సీబీఐకి ఎస్పీ సహకరించడం లేదు అని ఎవరు చెప్పారు..? ఎస్పీ రాధాకృష్ణ చెప్పారా..? సీబీఐ చెప్పిందా..?
  • నిన్న బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది..దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇదంతా చేశారు.
  • వాళ్లకి వారుగా క్రియేట్‌ చేసిన తుఫాన్‌ ఇది.

మీ రాతలు చూస్తే ఎవరికైనా ఆవేదన, ఆవేశం వస్తుంది.

  • మా పార్టీ అభిమానులు ఆవేశం, బాధ కలిగినవారు అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వస్తారు.
  • మీరు ఇలాంటి రాతలు రాయబట్టే కదా.. వారంతా బాధతో బయటకు వస్తున్నారు..?
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమైనా కార్యకర్తలు లేరనుకుంటున్నారా..? కోట్ల మంది అభిమానులున్నారు… ఎవరికి అన్యాయం జరిగినా వారంతా తప్పకుండా వస్తారు..
  • మీరు రాసే ఘోరమైన రాతలు చూస్తే.. ఎవరైనా ఆవేదన, ఆవేశం వస్తుంది.
  • మీ రాతలతో కుటుంబాన్ని పలుచన చేయాలని చూస్తున్నారు… తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామాలు, నాటకాలు అంటున్నారు.
  • ఆ తప్పుడు రాతలు చూస్తే ఎవరికైనా కడుపుమండకుండా ఉంటుందా..? మీ మీద ఇలాగే రాస్తే ఊరుకుంటారా..?
  • వాళ్లిష్టం ఏదైనా అంటారు…నిన్న ఎవరో రాష్ట్రపతి పాలన విధించాలి అంటున్నాడు.
  • ఆ డిబేట్లలో కూర్చునే వాళ్లని చూస్తే అసలు ప్రపంచ యుద్ధాన్ని కూడా సృష్టించగల శక్తి వారికుందేమో అనిపిస్తుంది.
  • ఇదంతా చూశాక అభిమానించే మా పార్టీ వారిలో బాధ, ఆక్రోశం రాకుండా ఎలా ఉంటుంది..?
  • రియల్‌ మీడియాపై ఎవరిమీదైనా దాడి జరిగిందా..?

రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిలా నిలిపిన నాయకుడు శ్రీ వైఎస్‌జగన్‌

  • పార్టీ పెట్టిన 8 ఏళ్లలోనే రీసౌండింగ్‌ విక్టరీతో 151 స్థానాల్లో విజయం సాధించాం.
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనంలా అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ఆ ఫలితాలు వచ్చాయి.
  • ముందుగానే తయారు చేసుకున్న బ్లూ ప్రింట్‌ ప్రకారం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు
  • మే30న జగన్మోహన్‌ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగేళ్లలో 98.5 శాతంపైగా హామీలను పూర్తిగా అమలు చేశారు.
  • ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం అయిన పార్టీ పనితీరు ఎలా ఉంటుంది, అలాంటి పార్టీపై ఆశలు పెట్టుకుంటే ఎంత సక్రమంగా అమలు చేసి చూపుతారు అనేది ఈ నాలుగేళ్లలో ప్రస్ఫుటంగా కన్పించింది.
  • ఈ నాలుగేళ్లలో రాష్ట్రం దేశానికి దిక్చూచిలా నిలబడేలా చేసిన నాయకుడు శ్రీ వైఎస్‌జగన్‌
  • పాలన వికేంద్రీకరణ, గడప వద్దకు పాలన వంటి వాటి ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారు.
  • పారదర్శకంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం వల్ల పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.

జగన్ గారు ఉంటేనే సంక్షేమం-అభివృద్ధి..

  • రాష్ట్రంలో పెట్టబడులు వెల్లువలా రావడానికి కారణమయ్యే నాలుగు కీలక పోర్టులను ఈ నాలుగేళ్లలోనే చేపట్టాం.
  • రామాయపట్నం పోర్టు వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు. మిగిలినవి రానున్న రెండుమూడేళ్లలో పూర్తి అవుతాయి.
  • మనకున్న సుదీర్ఘ కోస్తా తీరాన్ని వినియోగించుకునేలా వాస్తవ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నారు సీఎం జగన్‌ గారు.
  • జగన్‌ గారు ఏం చేస్తున్నారు అనేవారికి ఇవన్నీ సమాధానాలు.
  • అభివృద్ధి అంటే నాలుగు చిన్న ఫ్యాక్టరీలు పెట్టడమే కాదు..చోదక శక్తుల వంటి పోర్టులు, 17 మెడికల్‌ కాలేజీలు, రోడ్ల విస్తరణ.. లాంటివన్నీ ఆర్ధికాభివృద్ధికి చోదకాలుగా నిలుస్తాయి.
  • ఒక పక్క పేదరికం నుంచి ప్రజలను పైకి తీసుకురావడం, మరో పక్క ఆర్ధికాభివృద్ధిని పెంపొందించడానికి చోదకశక్తులను ప్రోత్సహించడం చేస్తున్నాం.
  • పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే జిల్లాల విభజన జరిగింది.
  • మూడు రాజధానులు వ్యవహారం.. కోర్టు కేసులను దాటుకుని వచ్చిన తర్వాత, ఆచరణలోకి వస్తే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడుతోంది.
  • ఇప్పటికే రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.
  • జగన్‌ గారు ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి సాగుతుందని ప్రజలు గ్రహించారు.
  • 2019 ఎన్నికల కంటే రీసౌండ్‌ విక్టరీ 2024లో ఉండబోతోంది.

ఈనాడు కడుపు మంటకు మందే లేదు.

  • రూ. 10 వేల కోట్లు ఇచ్చి కేంద్రం ఒక్కసారి పెద్ద ఊరట ఇచ్చిందని ఒక పత్రిక రాసిన వార్తలు చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు.
  • సమర్ధంగా పనిచేస్తున్నాం… రావాల్సిన నిధులను రాబట్టుకుంటున్నాం.
  • అవి హక్కుగా రాష్ట్రాలకు రావాల్సినవి…బాధ్యతగా కేంద్రం ఇచ్చే నిధులు.
  • నిధులు సరిగ్గా మేం తెచ్చుకోలేకపోతే అది ప్రభుత్వ అసమర్దత అవుతుంది.
  • గతంలో చేయలేనిది ఇప్పుడు మేం చేశాం.
  • ఈనాడులో వారి కడుపు మంటకు ఏ మందూ పనికిరాదేమో అనిపిస్తోంది.
  • రాష్ట్రానికి ఊరటో… జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌కి ఊరటో అర్ధం కాని రాతలు రాస్తున్నారు.
  • విచిత్రంగా డబ్బుల వాన అని రాశారు. కేంద్రం నుంచి రావాల్సింది తీసుకొచ్చాం.
  • జగన్‌ గారు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి తీసుకొస్తున్నారు.
  • వీళ్లే ఒక్కొక్కసారి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదు అని కూడా రాస్తారు..
  • ఇప్పుడేమో కేంద్రం కరుణ చూపించిందంటూ రాస్తున్నారు.
  • చంద్రబాబు కేంద్రంలో పార్టనర్‌గా ఉండి కూడా తీసుకురాలేకపోయాడంటే అది అతని చేతగాని తనం.
  • ఇన్నాళ్లు జగన్‌ గారు ఏం చేస్తున్నారు అనేవారికి ఇదే మా సమాధానం.
  • తన రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు, ప్రజలు తనకు ఇచ్చిన అధికారాన్ని తాకట్టు పెట్టాడు.
  • ఓటుకు కోట్లు ఎరవేసిన కేసులో పరారై ఇక్కడకు ఎలా వచ్చాడో… అలానే కేంద్రంలో కూడా తన వ్యక్తిగత అవసరాలనే చూసుకున్నాడు.

రాష్ట్రానికి మంచి జరిగినా భరించలేనితనం:

  • రాష్ట్రానికి రావాల్సిన నిధులకు.. ఏదైనా అడ్డంకి వచ్చిందటే వారికి ఎంతో ఆనందం.
  • వారు చెప్పినట్టుగా జరగకపోతే ఎన్జీటీ, కేంద్రం మీద కూడా తప్పుడు రాతలు రాస్తారు.
  • రాష్ట్రాన్ని వీరంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదు.
  • చంద్రబాబును అర్జెంటుగా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనే దుగ్ధతో రాష్ట్రానికి మంచి జరిగినా భరించలేని తనం వారిలో కన్పిస్తోంది.
  • ఎక్కడో తెలంగాణాలో కూర్చుని వారు రాసేరాతలు చూస్తుంటే వీరికి రాష్ట్రంపై ప్రేమ ఉండే అవకాశం ఏమాత్రం లేదనిపిస్తుంది.
  • వీళ్లంతా నాన్‌ రెసిడెంట్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌…హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు.
  • రాష్ట్రంపై ఎటూ ప్రేమ లేదు… రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే వీరికి బాధ. చెడు జరిగితే వారికి ఆనందం
  • దానికి తోడు వారి కడుపులోని కుళ్లు నగ్నంగా చూపెట్టుకుంటున్నారు.
  • నిధులు వచ్చినా, రాకపోయినా పట్టుదలగా చెప్పిన ప్రకారం చెప్పినట్టు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మాది.
  • చంద్రబాబులా, తన స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించుకునే వ్యక్తి జగన్ గారు కాదు
  • వ్యక్తిగత అవసరాల కోసం అధికారాన్ని వాడుకునే వాడు అయితే పరిస్థితి వేరేలా ఉండేది.
  • కాదు కాబట్టే చంద్రబాబుపై కేసులు నాలుగేళ్లపాటు కోర్టులు దాటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
  • చంద్రబాబు హయాంలో దారుణమైన స్కాంలు, దోపిడీలు జరిగినా.. చట్టం తన పని తాను చేయాలని వదిలేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article