మరోసారి ఆదరించండి….జగనన్నను, అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
రూరల్ ఇంచార్జ్ చవ్వా దుష్యంత్ రెడ్డి
పులివెందుల :పులివెందుల మండలం పరిధిలోని కణం పల్లె, మొట్నూతల పల్లె గ్రామాలలో పులివెందుల మండల ఇంచార్జ్ చవ్వా దుష్యంత్ రెడ్డి , ఎన్నికల ప్రచారం ఆదివారంనిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి మీ అమూల్యమైన రెండుఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి, వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, జగనన్నను అవినాష్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఆయ న అన్నారు.చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఇచ్చిన హామీల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నా రు. ఎన్ని పార్టీలు ఏకమైన వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆపలేవు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు. బిజెపి, టిడిపి, జనసేన, పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా రాష్ట్ర ప్రజలు జగన్మో హన్ రెడ్డి కే ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నా రన్నారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు.అంతకుముందుగా వైకాపా నాయకులు బాణసంచాలు పేలుస్తూ ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పుష్పనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వో త్తమ్ రెడ్డి, బలరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, విశ్వనాథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, పాపయ్య, వేణు యాదవ్, మాజీ సింగల్ విండో అధ్యక్షుడు ఈశ్వర య్య,వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.