ఏలేశ్వరం:-ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు సమక్షంలో మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన వందమంది తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం వీరిని వరుపుల వైకాపా కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు మరియు వరుపుల సుబ్బారావు నాయకత్వానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అడపా పార్థ సారథి , మజ్జూరి సూర్య నారాయణ , సర్పంచ్ పీతల నూకరాజు , సాదే లోవరాజు తదితరులు ఉన్నారు.