పోరుమామిళ్ల:బద్వేల్ నియోజకవర్గం వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సోమవారం పోరుమామిళ్ల మండలం సంచర్ల గ్రామపంచాయతీ కి సంబంధించిన వైసీపీ నాయకులతో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని ఆ పథకాలను ప్రజలకు అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 95% పూర్తి చేశారన్నారు. అటువంటి నాయకున్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మన బద్వేల్ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి సుధమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్, హుస్సేన్ పీరా, సర్పంచ్ దస్తగిరి, గంగయ్య, కొండారెడ్డి, జయరాంరెడ్డి, గంగరాజు, వెంకటేష్ వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది.