కదిరి :తనకల్లు మండల పరిధిలోని ఉస్తినపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల ముస్లిం మైనార్టీ సోదరులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ ఆయన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీలకతీతంగా సీఎం జగనన్న అందించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారి పార్టీలో చేరారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవడానికి కృషి చేయాలని వారిని కోరారు. పార్టీలో చేరిన వారిలో హుస్సేన్ పీరా, ఖాదర్ బాషా, నజీర్, రమేష్ బాబు, హుస్సేన్ బాషా, షాజహాన్, ముస్తఫా, మహమ్మద్ రఫీ, లతీఫ్ బాషా తదితరులు ఉన్నారు.