Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలి: ఎంపీ గల్లా జయదేవ్​

వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలి: ఎంపీ గల్లా జయదేవ్​

న్యూఢిల్లీ:‌
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో తన చివరి ప్రసంగం చేశారు. రానున్న కాలంలో తాను చేపట్టే కార్యచరణ, ఇప్పటి వరకు తాను నిర్వర్తించిన విధులను ఆయన గుర్తు చేశారు. తనకు అవకాశం ఇచ్చిన టీడీపీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజల కలలను నిజం చేస్తున్న మోదీకి ధన్యవాదాలు అంటూ పార్లమెంట్​లో స్పందించారు.సభలో ఎందరో పెద్దలు తనకు మార్గదర్శకంగా ఉన్నారని వివరించారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులదీ కీలక పాత్ర అని, ఎందరో వ్యాపారులు చట్టసభలకు ఎన్నికవుతున్నారని అన్నారు. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలని, రాష్ట్రం, దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటానని ప్రకటించారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆయన వివరించారు.విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యాసంస్థలు ఏపీలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్​లో అన్నారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు.దేశంలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, ఎయిర్‌పోర్టులు, హైవేలు దేశంలో పెద్దసంఖ్యలో వచ్చాయని వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఓ మైలురాయి అని అన్నారు. పీఎం కిసాన్‌, పసల్‌ బీమా యోజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని వివరించారు.
అయోధ్య రామాలయం కట్టించినందుకు మోదీకి ఎంపీ గల్లా జయదేవ్ ధన్యవాదాలు​ తెలిపారు. శతాబ్దాల భారతీయుల కలను ప్రధాని నిజం చేశారని, దేశం పట్ల మోదీ విజన్‌కు తన అభినందనలు అని ప్రకటించారు. పదేళ్లుగా భారత్‌ను ప్రధాని మోదీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. జీ20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిపారని పేర్కోన్నారు.తనను పార్లమెంటుకు పంపిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు ప్రజలకు తన శాయశక్తులా కృషిచేసినట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల ఆందోళనకు ఇప్పటికీ తన మద్దతు ఉందని గల్లా వెల్లడించారు. అమరావతిని స్మార్ట్‌ సిటీగా నిలిపేందుకు కృషి చేసినట్లు తెలిపారు.దేశంలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, ఎయిర్‌పోర్టులు, హైవేలు దేశంలో పెద్దసంఖ్యలో వచ్చాయని వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఓ మైలురాయి అని అన్నారు. పీఎం కిసాన్‌, పసల్‌ బీమా యోజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని వివరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article