ఏలేశ్వరం:
మండలంలోని రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు రహదారి పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ రాజా తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట గ్రామం వరకు పాదయాత్ర చేపట్టి రహదారి కి అడ్డుగా గోడను నిర్మించారు. ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు లక్ష్మీపురం గ్రామం చేరుకుని అక్కడ నుండి నాలుగు కిలోమీటర్లు రమణయ్యపేట గ్రామం చేరుకుని రహదారిపై గోడను నిర్మించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సత్య ప్రభ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం మండలంలో ఉన్న రహదారులను పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప రహదారి నిర్మించే పరిస్థితి లేదన్నారు. అనంతరం ఆమె స్వయంగా గోడను నిర్మించారు. ఈ పాదయాత్ర లో పెద్ద సంఖ్య లో టీడీపీ శ్రేణులు, జనసైనికులు పాల్గొన్నారు.రమణయ్య పేట వరకు నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన అనంతరం రోడ్డు కి అడ్డుగా గోడ నిర్మించడం తో సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ నిలిచిపోయింది.అధికారులు వచ్చి రోడ్డు నిర్మాణం పై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలే పరిస్థితి లేదు అని సత్య ప్రభ హెచ్చరించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది అని పోలీసులు నిరసన విరమించాలి అని కోరారు.ఈ సందర్బంగా సత్య ప్రభ మీడియా తో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రోడ్డు నిర్మించక పోతే టీడీపీ,జనసేన ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతాం అన్నారు.ఈకార్యక్రమం లో టీడీపీ శ్రేణులు,జనసైనికులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు