నందమూరి వసుంధర దేవి
ప్రాచీన కళలను ఆధునికులకు తెలియపరచడమే
కావూరి కుటుంబ లక్ష్యం
లేపాక్షిలో అంబరాన్నంటిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన
లేపాక్షి : సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ నందమూరి కుటుంబ ధ్యేయమని బాలకృష్ణ సతీమణి నందమూరి వసుందర దేవి పేర్కొన్నారు.
కావూరి కుటుంబం ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్య ప్రదర్శన దేశ, విదేశాల్లో ప్రదర్శించడం జరుగు తోంది.
ఏడాది కోసారి ప్రసిద్ధ ఆలయ ప్రాంగణాల్లో ఆయన డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్యం చేయడం
సాంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే సినీ నటుడు
హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు ఆయన డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో
లేపాక్షి వీరభద్ర ఆలయ ప్రాంగణంలో సంస్కృతిక నృత్య ప్రదర్శన ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వసుంధర దేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలను, ప్రాచీన కళలను పరిరక్షించడం కోసం ఆయన డ్యాన్స్ అకాడమీ సభ్యులు ప్రాచీన నృత్య కళను ప్రదర్శించారు. నందమూరి బాలకృష్ణ లేపాక్షి అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో నంది ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. నేడు సాంస్కృతిక నృత్య ప్రదర్శన లేపాక్షిలో నిర్వహించేందుకు బాలకృష్ణ చొరవ తీసుకోవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రాచీన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఉర్రూతలూగించాయి .పరంపర సంస్థ ఆధ్వర్యంలో ,కావూరి కుటుంబం నేతృత్వంలో ఆయన డ్యాన్స్అకాడమీ సభ్యులు శ్రీ గణనాయక శరణు శరణు అనే విఘ్నే శ్వర స్తోత్రం తో వినాయక నాట్యాన్ని దీపారాధన చేస్తూ ప్రదర్శించడం జరిగింది. అనంతరం నమశ్శివాయచ నమశ్శివాయ అని స్తోత్రంతో ప్రదర్శించిన శివతాండవ నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అన్న కీర్తన చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. నృత్యకారులు చేస్తున్న నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మీ, నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ సతీమణి శ్యామల, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జయప్ప, స్థానిక నాయకులు ఆనంద్ కుమార్ నాగలింగారెడ్డి సిరివరం క్రిష్టప్ప బయన్నపల్లి రవి లతో పాటు నియోజకవర్గ స్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు వేలాదిగా హాజరయ్యారు.