జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్.
** రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత.
సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఉద్యోగం చేసేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడమనేది చక్కని కార్యక్రమమనిజిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.బుధవారం స్థానిక మండల తాహిసీల్దార్ కార్యాలయం వద్ద పెట్రోల్ బంకుకు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత, ఎంపి మార్గాని భరత్ రామ్, జైళ్ల అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ
సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఉద్యోగం చేసేందుకు పెట్రోల్ బంకులు నిర్వహించడం శుభ సూచకమన్నారు.ఖైదీలు జీవనోపాధికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వలన వారు విడుదలైన తర్వాత సమాజంలో వారు ఉద్యోగం చేసుకునేందుకు పెట్రోల్ బంకులో అందించే సేవలు ఎంతో దోహదపడుతుందన్నారు. భారతదేశానికి గ్రామ స్వరాజ్యం కావాలని మహాత్మా గాంధీ అన్న మాటను నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తూ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి నిజం చేశారన్నారు.మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖలో 17 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి, ఖైదీల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఒక్కొక్క ఖైదీకి రోజుకి 200 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుమారు నెలకు 12 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.జైలు శాఖ కార్పస్ నిధులతో ఇండియన్ ఆయిల్ మరియు హెచ్ పి ఎల్ సంస్థల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్ నుంచి వచ్చే ఆదాయము కార్పస్ ఫండ్ కు జమ చేయడమే కాకుండా జైలు అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోఎంపి మార్గాని భరత్ రామ్, డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ & డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ & కరెక్షనల్ సర్వీసెస్స్, హరీష్ కుమార్ గుప్తా, ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఐ.శ్రీనివాసరావు, డిఐజి (కోస్తాంధ్ర ప్రాంతం) యం. ఆర్.రవి కిరణ్, సూపరింటెం డెంట్ ఆఫ్ జైల్స్, ఎస్. రాహుల్ఆఫ్ పోలీస్, జిల్లా ఎస్.పి. జగ దీశ్ తదితరులు పాల్గొన్నారు.