ప్రజాభూమికి బాసటగా నిలుస్తున్న గాయనీమణులు
ప్రజాభూమి,pbtv అందిస్తున్నది వాస్తవమేనన్న
పరుచూరి, రూపశ్రీ
ఒక్కొక్కరు బైటకి వస్తున్న వైనం
కళాసంస్థల తీరును ఎండగడుతున్న సీనియర్లు
కౌతాళం కుట్రలు చేధించేందుకు ప్రజాభూమి కి చేకూరుతున్న బలం
అవార్డులతో దండుకున్నది నిజమేగా ..
విజయవాడ:
సత్యాన్ని ఎవరు చేరిపేయలేరు.నిజాన్ని అనగద్రొక్కిన అది నివురుగప్పిన నిప్పులా దహించి వేసి బ్రహ్మాండం బద్దలు కొడుతుంది.ఇది జగత్తుకు సాక్ష్యం. దీనిని కాదనే దమ్ము ఎవరికి లేదు.కానీ కౌతాళం వేదిక కొన్ని కళాసంస్థలు చరిత్రనే తిరగరాసే పనిలో నిమగ్నమయ్యారు. కళామతల్లి ముసుగులో చేస్తున్న అకృత్యాలు ఆగడాలపై ప్రజాభూమి, pbtv నిరంతర పోరాటం చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు, బెదిరింపులు, భయబ్రాంతులకు గురిచేసిన అవేమి లెక్క చేయక ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణం లో కఠోర వాస్తవాలు వెలుగలోకి వస్తున్నాయి.కొంతమంది కళాసంస్థల అధినేతలు తలకెక్కిన గర్వంతో ఈ సమాజాన్నే శాసించాలని భావించారు,భావిస్తున్నారు కూడా. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు వెలుగులో కి తీసుకు వస్తుంది ప్రజాభూమి.సత్యశోధనలో మాకు సీనియర్లు బాసటగా నిలుస్తున్నారు. మితిమీరిన కళాసంస్థల తీరు,అడ్డగోలు విధానాలు అనేక కథనాలను అందిస్తూనే ఉంది ప్రజాభూమి. ఈ క్రమంలో మహానటి సావిత్రి కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పెద్దలు పరుచూరి విజయలక్ష్మి మొదట స్పందించి ప్రజా భూమి పోరాట పఠిమను పెద్ద మునుసుతో అభినందించారు. అదే విదంగా pbtv ఇంటర్వ్యూలో కొన్ని కళాసంస్థల విధానాలను కూడా ఆమె నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు కడిగిపారేసి మార్పు రావాలని ఆకాక్షించారు.ఆ తరువాత మా ప్రయాణం లో అనేక బెదిరింపులు, ప్రాణ భయం తప్పదన్న సంకేతాలు కూడా పరోక్షంగా కొన్ని కళా సంస్థల అధినేతలు సలహా ఇచ్చినట్లు,సూచించినట్లు,బెదిరించి బెదిరించనట్లు నడుచు కున్నారు.అయిన లెక్కచేయకుండా ముందుకు సాగుతూ ఉంటే పరోక్షంగా కొంత సపోర్ట్ ఉంటే ప్రత్యక్షంగా సీనియర్ గాయనీ రూపాసత్యశ్రీ pbtv ఇంటర్వ్యూలో మరికొన్ని కఠోర వాస్తవాలు వెల్లడించింది. ఇవన్నీ కూడా వారి వారి స్వానుభవంలో ఎదుర్కొన్న విషయాలనే వెల్లడించారు. ఇంకా వెల్లడి కానీ విషయాలు బోలెడు ఉన్నాయన్నది ప్రజాభూమి pbtv కి ఉన్న సమాచారం. పేద కళాకారులు,నిజమైన కళాకారుల శ్రేయస్సు కోసం వారి పక్షాన నిలుస్తున్న ప్రజాభూమి, pbtvకి అమూల్యమైన సందేశం, సలహాలు, సూచనలు ఇచ్చేవారిని,తమ గోడు వెల్లడించే వారిని ఎల్లవేళలా ఆహ్వానం పలుకుతోందని తెలియజేయుటకు సంతోసిస్తున్నాము.